Viral Video: రీల్స్‌ పిచ్చితో యువకుడు బలి.. వెనుక నుంచి ఢీకొన్న రైలు.. VIDEO

ఒడిశాలో ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్‌ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

New Update
A boy Killed after hit by Train In Odisha while making reel

A boy Killed after hit by Train In Odisha while making reel

ఈమధ్యకాలంలో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(viral video telugu) అవ్వడం కోసం యువతీ యువకులు ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు పట్టాలపై, బిల్డుంగులపై విచిత్రమైన రీల్స్‌ చేస్తూ చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్‌ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Also Read: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO

A Boy Killed After Hit By Train While Making Reel

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని మంగళఘాట్‌కు చెందిన 15 ఏళ్ల విశ్వజీత్‌ సాహూ మంగళవారం తన తల్లితో కలిసి ఓ ఆలయానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆ బాలుడు జనక్‌దేవ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర్లో ఆగాడు. రైలు పట్టాల వద్ద రీల్‌ రికార్డు చేయించాడు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన రైలు ఆ బాలుడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్తో ఓటింగ్?: ఎలక్షన్ ఆఫీసర్ కీలక ప్రకటన!

సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సాహూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఆ బాలుడిని రైలు ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. రీల్స్‌ కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. 

Also Read: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!

Advertisment
తాజా కథనాలు