ఛీ.. ఛీ నువ్వు మనిషేవేనారా.. నాలుగేళ్ల బాలికపై తాత అత్యాచారం

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఓ 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

New Update
rape

rape

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఓ 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పానిపట్‌ సెక్టార్‌ పరిధిలో రాంభాజ్‌ అలియాస్ పప్పు అనే వ్యక్తి ఉంటున్నాడు. అతడి వద్దకు సమీపంలో ఉన్న దంపుతులు తమ నాలుగేళ్ల కూతురుని ఆడుకునేందుకు పంపించేవారు. ఆ పాప తాత అంటూ రాంభాజ్‌ను అప్యాయంగా పలకరిస్తూ ఉండేది. కానీ అతడి మాత్రం ఆ చిన్నారిపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి తల్లిదండ్రుల ఫిర్యాదులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రాంభాజ్‌ను కఠినంగా శిక్షించాలంటూ అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

ఇదిలాఉండగా తెలంగాణలోని వనపర్తి జిల్లా రెవల్లి మండలం నాగపూర్ గ్రామంలో మరో దారుణం జరిగింది. ఇంట్లో నిత్యం గొడవలు, వేధింపులకు గురిచేస్తోందనే కోపంతో కోడలు తన అత్తను కర్రతో కొట్టి చంపడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దాసయ్య దంపతులకు నలుగురు కూతుళ్లతో పాటు ఓ కొడుకు సంతానం. భర్త దాసయ్య కొన్నేళ్ల క్రితమే మరణించాడు. దీంతో ఎల్లమ్మ తన కుమారుడు మల్లయ్యతో కలిసి ఉంటోంది. అయితే ఎల్లమ్మకు ఆమె కోడలు బోగురమ్మకు మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కూడా గొడవలు జరిగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్త ఎల్లమ్మను కోడలు కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో ఎల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read: నేడు, రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం.. కనువిందు చేయనున్న సూపర్‌మూన్

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అత్త నిత్యం తనను వేధిస్తోందని.. అందుకే   చంపినట్లు బోగురమ్మ పోలీసుల ముందు చేసిన నేరాన్ని అంగీకరించింది. మృతురాలు ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు బోగురమ్మపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also read: 9/11 దాడికి ముందే ఒసామా బిన్‌లాడెన్‌ గురించి హెచ్చరించాను.. ట్రంప్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు