/rtv/media/media_files/2025/10/06/supermoon-2025-10-06-19-36-28.jpg)
Supermoon
ఈరోజు, రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. రెండ్రోజుల పాటు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు పలుమార్లు భూమికి దగ్గరికి వస్తుంది. ఈ క్రమంలోనే సూపర్‌మూన్ ఏర్పడుతుంది. ఈ సమయంలో పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా పెద్ద 14 శాతం పెద్ద సైజులో, 30 శాతం అధిక వెలుగుతో చంద్రుడు కనిపిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: బీహార్ లో ఈ సారి సీన్ రివర్స్.. గేమ్ ఛేంజర్ గా ప్రశాంత్ కిషోర్ .. మారిన లెక్కలివే!
అంతేరాదు నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా మరో రెండు సూపర్‌మూన్ కనిపించనుంది. దీన్ని చూసేందుకు ప్రజలు ఏటా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా సూపర్ మూన్‌లను చూసి ఆనందించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Also Read: సుప్రీం కోర్టులో హై టెన్షన్.. న్యాయవాది CJIపై చెప్పులు విసిరేందుకు యత్నం!
ఎప్పుడు చూడొచ్చు ?
అక్టోబర్ 6న సూర్యాస్తమం అయిన వెంటనే చంద్రుడు చాలా పెద్దదిగా కనపిస్తాడు. అలాగే అక్టోబర్ 7న మంగళవారం సూర్యోదయానికి ముందు వరకు కూడా సూపర్ మూన్‌ను చూడొచ్చు. ఇక ఈ ఏడాది నవంబర్ 5, డిసెంబర్ 4, 2025న కూడా వరుసగా సూపర్ మూన్‌లు కనిపించనున్నాయి.
Also Read: ఆ దేశ ప్రధాని రాజీనామా..ఏడాదిలో ఐదుగురు ప్రధానుల రిజైన్