Air India : ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..స్పాట్ లో 161 మంది!

ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న విమానం ఇంజిన్‌లో ప్రాబ్లమ్ ఏర్పడింది.  ల్యాండింగ్‌ ముందు సమస్యను గుర్తించిన పైలట్‌.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నం చేశాడు.

author-image
By Krishna
New Update
airindia

ఎయిర్ ఇండియా విమానానికి(Air India Flight) పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండోర్(Delhi-Indore) వెళ్తున్న విమానం ఇంజిన్‌లో ప్రాబ్లమ్ ఏర్పడింది.  ల్యాండింగ్‌ ముందు సమస్యను గుర్తించిన పైలట్‌.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నం చేశాడు.దాదాపుగా  20 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. అతికష్టం మీద సురక్షితంగా విమానం ల్యాండ్ అయింది. ప్రమాద సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులున్నారు.

అందరూ క్షేమం

ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ 'పాన్-పాన్' అలర్ట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పంపారు. 'పాన్-పాన్' అంటే, తక్షణ సహాయం అవసరం అయినప్పటికీ ప్రాణాలకు ప్రమాదం లేని పరిస్థితి అని అర్థం. దీంతో, విమానాశ్రయ అధికారులు అగ్నిమాపక, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. సుమారు 20 నిమిషాల ఆలస్యంగా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 

పక్షి ఢీకొట్టడంతో

నాగ్‌పూర్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి సంబంధించిన ఒక భయంకరమైన సంఘటన తాజాగా  వెలుగులోకి వచ్చింది. విమానం 6E 812గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, కానీ ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఈ సంఘటన జరిగినప్పుడు విమానంలో  272 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక పక్షి ఇంజిన్‌ను ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. 

Also Read :Old Age Love Marriage: వీడియో - ముసలోడే కానీ మహా రసికుడు.. 65ఏళ్ల మహిళతో తోటలో పాడుపని - చివరికి

ఈ ఢీకొట్టడం వల్ల విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్, ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించి నాగ్‌పూర్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, విమానాశ్రయ అధికారులు,  సాంకేతిక నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్షి ఢీకొట్టిన కారణంగా విమానానికి ఎంత నష్టం జరిగింది అనేది అంచనా వేస్తున్నారు.

నాగ్‌పూర్ విమానాశ్రయం(Nagpur Airport) సీనియర్ డైరెక్టర్ అబిద్ రుహి ఈ సంఘటనపై స్పందిస్తూ, విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ సంఘటన వల్ల నాగ్‌పూర్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.

Also Read :  Ganesh Nimajjanam 2025: అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు