Kamareddy: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. వరసగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తూ.. ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేస్తున్నారు.

New Update
Kamareddy: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత

దళితులకు కాంగ్రెస్ ఏమి చేసింది..?

కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత (Kavitha) పర్యటించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్‌పై సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శలు చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదన్నారు. ఖర్గే (Kharge) వచ్చి ఎస్సీ డిక్లరేషన్ (SC Declaration) చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందని..రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదని కవిత ఆరోపించారు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమి చేసిందని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు ఏమి చేస్తారో అని చెప్పాలని అని అన్నారు. రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం.. ఆ సభకు అమిత్ షా (Amit Shah) రావడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని కవిత మండిపడ్డారు.

రైతు బంద్‌ను కాపీ కొట్టారు

తెలంగాణ రాష్ట్రం దళితులకోసం పనిచేస్తోనంది కవిత పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ (CM Kcr)  ప్రారంభించిన రైతుబంధును కాపీ కొట్టి ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)  ప్రభుత్వం రూ.13 కోట్ల మందికి రైతుబంధు ప్రారంభించి.. 2.5 కోట్ల మందికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం అందరికీ ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రజలందూ దీనిని గమనించాని సూచించారు.

బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ఉంది
మరోవైపు కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కవిత స్పందించారు. మీ డిక్లరేషన్‌ డస్ట్‌బిన్‌లో వేయడానికి పనికి వస్తుందని ఆమె అన్నారు. మీ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మేవిధంగా రిక్లరేషన్ లేదని కామెంట్‌ చేశారు. రిజర్వేషన్లపై పోరాడకుండా, పార్లమెంట్‌లో బీజేపీ (BJP)కి మద్దతుగా కాంగ్రెస్ ఉంటుందని కవిత చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో ప్రకటిస్తారని ప్రశ్నించింది. ఇకపై ఇలాంటి డిక్లరేషన్ చేయవద్దని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ చెప్పారు. ఇక జిల్లాలో ఎమ్మెల్సీ కవిత దూకుడు చూసి బీజేపీ నాయకులు కూడా ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ (ED) పలుమార్లు విచారించినా.. ఎందుకు అరెస్ట్‌ చేయలేదని బండి సంజయ్‌ (Bandi sanjay) ప్రశ్నించారు. మరోవైపు లిక్కర్‌ స్కాంలో కేంద్ర ప్రభుత్వంతో కవిత ఒప్పందం చేసుకున్నందుకే అరెస్ట్‌ నిలిచిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana)సంచనల వ్యాఖ్యలు చేసిన విషయం తేలిసిందే.

Also Read: బీజేపీ-బీఆర్ఎస్‌ ఒక్కటే..పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్‌

Advertisment
తాజా కథనాలు