ఫర్మిషన్ ఎలా ఇచ్చారు..?
పూర్తిగా చదవండి..బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Ponguleti Srinivas Reddy) అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు బస్సు లు ఇవ్వకుండా అడ్డుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే ఖమ్మంలో ఈ రోజు జరిగిన అమిత్‌షా సభకు వెయ్యి బస్సులకు ఫర్మిషన్ ఇచ్చిందని ఆరోపించారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన ఆత్మగౌరవ పాదయాత్ర 100వ రోజు సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
దుబ్బాక నియోజకవర్గాన్ని దూర దృష్టితో 20 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిన ఘనత చెరుకు ముత్యంరెడ్డిదే అన్నారు. టీడీపీ ( tdp)హయాంలో జన్మభూమి కార్యక్రమాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది చెరుకు ముత్యంరెడ్డి అన్నారు.ముత్యంరెడ్డి పరిపాలనను ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr) అభినందించలేదా అని ప్రశ్నించారు. 2014-18 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లక్ష రుణమాఫీ.. కేవలం 18 వేల నుంచి 20 వేలు మాత్రమే మాఫీ అయిందని పేర్కొన్నారు.అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఒకే సారి మాఫీ చేస్తాం అన్నారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు ఇచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేసీఆర్‌ను విమర్శించారు.
బెల్టు షాపులు మూత పడడం ఖాయం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల గృహ నిర్మాణంకు సాయం చేస్తామని, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు ఖమ్మంకు బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్న ఆగలేదని అదే ఈ రోజు అమిత్‌షా ( Amit Shah) వస్తే 1000 బస్సులు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శించారు. బీఆర్ఎస్- బీజేపీ రెండు ఒకటే అనడానికి ఇది నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టు షాపులు మూత పడడం ఖాయమని ఆయన అన్నారు.ధరణి పేరుతో లక్షల కోట్ల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసింది అన్నారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.అక్రమంగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వస్తుందని ప్రజలు గమనించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
[vuukle]