/rtv/media/media_files/2025/02/14/kbv9HeH0G4GgCv60py99.jpg)
Y+ Security For Thalapathy Vijay
Thalapathy Vijay Y+ Security : ప్రముఖ తమిళ నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ(Tamilaga Vettri Kazhagam Party) చీఫ్ విజయ్ దళపతికి కేంద్రం హో శాఖ భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y+ కేటగిరీ సెక్యురీటి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై విజయ్‌కి 24 గంటలపాటు స్పెషల్ కమాండోలు(Special Comando), పోలీసులు రక్షణ కల్పిస్తారు. యాక్టర్ అయిన విజయ్ దళపతి గతేడాది రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఆయనకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం భద్రత స్థాయిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also Read : Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
தவெக தலைவர் விஜய்க்கு Y பிரிவு பாதுகாப்பு - மத்திய உள்துறை அமைச்சகம் உத்தரவு@actorvijay has been granted ‘Y’ category security by the Union Home Ministry, meaning he will have 8 to 11 guards, including CRPF security officers and armed personnel, protecting him within Tamil Nadu pic.twitter.com/4rL0dvcdcJ
— 𝕌𝕥𝕙𝕒𝕪𝕒 (@Uthaya2911) February 14, 2025
Also Read: మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?
ఇద్దరు లేదా నలుగురు ఎస్పీజీ కమాండోలు..
వై ప్లస్ సెక్యురీటిలో('Y+' Security) మొత్తం 11 మంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో ఇద్దరు లేదా నలుగురు ఎస్పీజీ కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు. విజయ్ కాన్వాయ్‌లో ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటాయి. ఈ భద్రతా సిబ్బంది ఖర్చు మొత్తం కేంద్రమే భరించనుంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో తమిళ వెట్రి కజగం పార్టీ పోటీ చేస్తోందని విజయం గతంలోనే ప్రకటించాడు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి
Also Read: బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్