Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ అదరగొట్టింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్స్ జాన్వీ అందాలను బంధించడానికి తెగ ఉత్సాహం చూపించారు.

New Update
janhvi kapoor latest news

janhvi news Photograph: (instagram)

నటి జాన్వీ కపూర్ తరచూ సొషల్ మీడియాలో గ్లామరాస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.  తాజాగా ఈ ముద్దుగుమ్మ ల్యాక్మే ఫ్యాషన్ వీక్ 2025 ఈవెంట్ లో మరోసారి తన అందాలతో కట్టిపడేసింది. ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు షోస్టాపర్‌గా నిలిచింది. ఈ ఫ్యాషన్ షో కోసం జాన్వీ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ ధరించింది. ఆపై పొడవాటి సూట్ వేసుకొని ర్యాంప్ పైకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. 

ర్యాంప్ పై సూట్ తీసేసి

ర్యాంప్ పైకి వచ్చిన జాన్వీ స్టేజ్ మధ్యలో స్టైలిష్ గా  కోట్ తీసేసి ర్యాంప్ వాక్ అదరగొట్టింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో అదిరిపోయే  స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఫోటోగ్రాఫర్లు అమె  అందాలను బంధించడానికి తెగ ఉత్సాహం చూపించారు. జాన్వీ స్టేజ్ పై డ్రెస్ తీసేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే జాన్వీ ర్యాంప్ వాక్ పై కొందరు ప్రశంసలు కురిపించగా.. మరికొందరు విమర్శించారు. జాన్వీ మిగతా వాళ్ళ వాక్ పాడు చేసింది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఆత్మవిశ్వాసం, నడక, వావ్ అని మరొకరు కామెంట్ పెట్టారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ntr తో దేవర2, రామ్ చరణ్ తో 'పెద్దీ' సినిమా చేస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జాన్వీ ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు