Vijay-Rashmika: కాబోయే భార్యకు అందరి ముందే ముద్దు పెట్టిన విజయ్.. వీడియో వైరల్!

రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ హిట్ కావడంతో సక్సెస్‌ మీట్‌ను ఇటీవల నిర్వహించారు. దీనికి వచ్చిన విజయ్ దేవరకొండ పబ్లిక్‌లోనే రష్మిక చేతిపైన ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Vijay video

Vijay video

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రష్మిక మందాన్న అద్భుతంగా నటించిందని కూడా ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించింది. దీనికి విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

ఇది కూడా చూడండి: Priyanka Chopra: "వరల్డ్‌’స్ వరస్ట్ కేప్ట్ సీక్రెట్!" ప్రియాంక చోప్రా క్రేజీ వీడియో బైట్ వైరల్!!

పబ్లిక్‌లోనే ముద్దు పెట్టిన..

వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలను రష్మిక లేదా విజయ్ ఖండించలేదు. అయితే ఈ సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ రష్మిక చేతిపై పబ్లిక్‌లో ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ ముద్దు పెడితే రష్మిక కూడా సిగ్గు పడుతూ బ్లష్ అవుతోంది. అయితే డైరెక్ట్‌గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: SSMB 29 Update: నెక్ట్స్ లెవెల్ మచ్చా.. SSMB 29 నుంచి పిచ్చిక్కించే పోస్టర్.. కుర్రకారు క్లీన్ బౌల్డ్

Advertisment
తాజా కథనాలు