/rtv/media/media_files/2025/11/12/ssmb-29-priyanka-chopra-poster-released-1-2025-11-12-20-18-30.jpg)
SSMB 29 priyanka chopra poster released
రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత అవైటెడ్ ఫిల్మ్ ‘SSMB29’. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా మైండ్ బ్లాంకయ్యే పోస్టర్ రిలీజ్ అయింది. హీరోయిన్ ప్రియాంక చోప్రా చీరలో గన్ షాట్‌తో రిలీజైన ఈ పోస్టర్ పిచ్చెక్కిస్తోంది. ఎల్లో కలర్ చీరలో నడుము చూపిస్తూ.. చేతిలో గన్ పట్టుకుని ఫైర్ చేసిన లుక్.. కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
SSMB 29 Update
The woman who redefined Indian Cinema on the global stage. Welcome back, Desi Girl! @priyankachopra
— rajamouli ss (@ssrajamouli) November 12, 2025
Can’t wait for the world to witness your myriad shades of MANDAKINI.#GlobeTrotterpic.twitter.com/br4APC6Tb1
ఈ పోస్టర్ ప్రకారం.. ప్రియాంక చోప్రా ఎల్లో కలర్ శారీలో సాంప్రదాయంగా కనిపించింది. కాళ్లకు చెప్పులు, చెవులకు రింగులు, చేతికి బ్రాస్‌లైట్‌తో మెస్మరైజ్ చేసింది. కానీ ఆమె లుక్ మాత్రం విలన్లకు చుక్కలు చూపించినట్లు కనిపిస్తోంది. చేతిలో గన్ పట్టుకుని ఫైర్ చేసిన విధానం.. అదే సమయంలో ఆమె నడుముకు తగిలిన బుల్లెట్ గాయంతో బయటకొచ్చిన రక్తం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మరీ ముఖ్యంగా ఆమె ఈ సీన్‌లో చూపించిన నడుము ఒంపుసొంపులకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.
ఈ పోస్టర్‌ను దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా షేర్ చేస్తూ.. ‘‘ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీ అమ్మాయి, తిరిగి స్వాగతం!. మందాకిని లెక్కలేనన్ని ఛాయలను ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను.’’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
దీని బట్టి నటి ప్రియాంక చోప్రా ఈ మూవీలో మందాకిని అనే పాత్రలో నటించబోతున్నట్లు దర్శకుడు చెప్పేశాడు. ఈ పేరుకి ఆమె అందమైన లుక్‌కి సరిగ్గా సెట్ అయిందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఏదేమైనా మొత్తంగా ఈ మాస్ యాక్షన్ అండ్ క్యూటెస్ట్ పోస్టర్ అటు రాజమౌళి ఫ్యాన్స్ ఇటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి.
Follow Us