/rtv/media/media_files/2025/11/12/priyanka-chopra-2025-11-12-17-21-54.jpg)
Priyanka Chopra
Priyanka Chopra: మహేష్ బాబు(Mahesh Babu) - రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం గ్లోబ్‌ట్రాటర్(Globetrotter) గురించి హడావుడి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా చేరడంతో ఉత్సాహం మరింత పెరిగింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
/rtv/media/post_attachments/4fd56339-507.png)
ప్రియాంక చోప్రా తన వీడియోలో “నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఎందుకు ఉంటానో తెలుసా? ఇదే వరల్డ్’స్ వరస్ట్ కేప్ట్ సీక్రెట్! ఇక అందరికీ చెప్పే సమయం వచ్చింది,” అంటూ సరదాగా చెప్పారు. ఆమె ఈ వీడియోలో నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే గ్లోబ్‌ట్రాటర్ గ్రాండ్ ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.
చిత్ర బృందం ఈ వీడియోను తమ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో షేర్ చేస్తూ, “ఆమె ఎక్కడికైనా వెళ్లింది, ఇప్పుడు ఇక్కడ ఉంది! ఈ ఈవెంట్‌ను ఎందుకు మిస్ అవ్వకూడదో ప్రియాంక చెబుతుంది” అంటూ పోస్ట్ చేసింది.
ఇటీవల మహేష్ బాబు కూడా ఒక వీడియో విడుదల చేశారు. “ఇన్ని నెలలుగా మీరు అడుగుతున్న ప్రశ్నకు సమయం వచ్చింది. నవంబర్ 15న మా కథలోకి ప్రపంచం మొదటి అడుగు వేస్తుంది. మా హృదయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ను మీరు తప్పకుండా చూడాలి” అని మహేష్ అన్నారు.
భారీ స్థాయిలో ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించడానికి రాజమౌళి టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
విలన్ గా పృథ్విరాజ్ లుక్ వైరల్.. ఈ ఈవెంట్‌కు ముందే పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర ‘కుంభ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. అతను సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తాత్కాలికంగా గ్లోబ్‌ట్రాటర్ అనే పేరుతో షూట్ అవుతోంది. ఇది ఆఫ్రికా జంగిల్ నేపథ్యంతో సాగే యాక్షన్ అడ్వెంచర్ కథగా రూపొందుతోంది.
ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి వచ్చిన అప్‌డేట్స్ వల్ల అభిమానుల్లో ఉత్సాహం పీక్స్‌కి చేరింది. నవంబర్ 15న జరిగే ఈ ఈవెంట్‌లో చివరగా టైటిల్, ట్రైలర్ విడుదల కావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా గ్లామర్ కలిస్తే ఈ చిత్రం గ్లోబల్ లెవెల్‌లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.
Follow Us