/rtv/media/media_files/2025/01/23/9qR1RWVyeYJuW7e8Leim.jpg)
Venkatesh First Reaction on Dil Raju IT raids
Venkatesh On IT Raids: తెలుగు ఇండస్ట్రీలో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు(Dil Raju) ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. అలాగే 'పుష్ప 2'(Pushpa 2) భారీ కలెక్షన్ల నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) ఇంటిపై కూడా రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
ఐటీ సోదాలపై అనిల్ రియాక్షన్
ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఐటీ సోదాలపై స్పందించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthi ki Vasthunam) మూవీ సక్సెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సక్సెస్ మీట్‌లో ఓ జర్నలిస్ట్ సరదాగా ఒక ప్రశ్న అడిగారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఐటీ రైడ్స్(Dil Raju IT Raids) బాధలో ఉన్నారు కదా.. ఈ సమయంలో మీరు సక్సెస్ మీట్ చేసుకుంటారా? అని ఓ ప్రశ్న వేశాడు.
Also Read: Horoscope Today: నేడు ఈ 2 రాశులవారికి మనోబలం ఎక్కువగా ఉంటుంది...ఈ రాశుల వారికి అయితే..!
దానికి అనిల్ రావిపూడి సమాధానమిస్తూ.. తాము ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టాం. అలాగే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని అనుకున్నారేమో అని అన్నారు. ఇకపోతే నిర్మాత దిల్ రాజు బాధలో లేరని.. ఆయన ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖుల ఇళ్లపై రైడ్స్ జరుగుతున్నాయని అన్నారు. ఇదంతా నార్మల్ ప్రోసెస్ అని తెలిపారు.
Also Read: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తి
వైట్ మనీ తీసుకుంటా..
ఇండస్ట్రీ, బిజినెస్ వాళ్లపై ఇలా జరగడం సాధారణమేనని అన్నారు. కాగా దిల్ రాజు తమకు ఒక మాట చెప్పారని.. తాను వచ్చినా రాకపోయినా సినిమా ప్రమోషన్స్ ఆపొద్దని అన్నారని తెలిపారు. అనంతరం ఈ విషయంపై హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) స్పందించారు. తాను ఫుల్ వైట్ అని అన్నారు. తీసుకునేది తక్కువే.. ఎక్కువ తీసుకోనన్నారు. తీసుకునేది అయినా వైట్ మనీనే(White Money) అని అన్నారు. అది అయినా ఆఫీసులో తీసుకుంటానని అన్నారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.