Meerpet Incident
Meerpet Incident: భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టిన గురుమూర్తి కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శవాన్ని మాయం చేయడానికి నిందితుడు గురుమూర్తి వేసిన ప్లాన్ యావత్ ప్రజలను కలవరపరుస్తోంది. గురుమూర్తి భార్య శవాన్ని 72గంటల పాటు కుక్కర్లో ఉడికించినట్లు తెలుస్తోంది. శవాన్ని కిలోలు కిలోలుగా విడదీసి పలుమార్లు ఉడికించినట్లు సమాచారం. దృశ్యం, సూక్ష్మదర్శని వంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూసి శవం మాయం చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాడట గురుమూర్తి. అంతేకాదు భార్యను చంపేముందే నిందితుడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపి ముక్కలు చేసినట్లు తెలుస్తోంది.
శరీరంలో మెత్తటి భాగాలు కోసి..
జనవరి 14న భార్యను చంపిన గురుమూర్తి ఆ తర్వాత మూడు రోజుల పాటు శవాన్ని మాయం చేసే ప్లాన్ లోనే ఉన్నాడు. ముందుగా ఇంట్లో ఉన్న రెండు కత్తులతో శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోసి వాటిని 6 గంటల పాటు వాటర్ హీటర్ ద్వారా బకెట్లో ఉడికించాడు. ఆ తర్వాత వాటిని ఎండబెట్టి.. రోలులో వేసి దంచి, పొడి చేశాడు. ఇంతటితో అతడి పైశాచికం ఆగలేదు. బోన్స్‌ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చి.. ఆ బూడిద మొత్తాన్ని2 బకెట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేశాడు. అంతా చేసిన తరవాత మళ్ళీ తనకేమీ తెలియనట్లు భార్య కనిపించట్లేదని ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు ముందు నటించాడు. పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఇక చివరికి ఊరు నుంచి భార్య వెంకట మాధురి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడంలేదని పోలీసులకు కంప్లైట్ ఇవ్వడంతో అసలు నిజం బయటపడింది.
సినిమా చూసొచ్చిన తర్వాత హత్య..
అయితే భార్యను చంపడానికి ముందు గురుస్వామి పిల్లలు, భార్యతో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు వెళ్ళాడు. ఆ తర్వాత పిల్లలను అమ్మమ ఇంట్లో వదిలేసి.. భార్య భర్తలిద్దరూ ఇంటికి వచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత భర్త గురుస్వామితో గొడవ పెట్టుకున్న భార్య తాళి తీసి అతడి మొహం విసిరికొట్టింది. దీంతో కోపమొచ్చిన గురుస్వామి భార్యను గోడకేసి కొట్టాడు. ఈ క్రమంలోనే ఆమె మరణించడంతో శవాన్ని మాయం చేసేందుకు కిరాతకంగా ప్లాన్ చేశాడు.
Also Read: Rashmika Mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన