/rtv/media/media_files/2025/11/27/ott-rom-com-2025-11-27-12-42-55.jpg)
OTT Rom-Com
OTT Rom-Com:బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన రొమాంటిక్ కామెడీ(Romantic Comedy) ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి'(Sunny Sanskari Ki Tulasi Kumari) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ ధావన్(Varun Dhawan), జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద ఇండియన్ వెడ్డింగ్ నేపథ్యంతో సాగిన ఈ చిత్రం, కుటుంబానికి దగ్గరగా ఉండే రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ తో నిండిపోయింది.
Also Read: 'RX100', 'మంగళవారం'కు మించి అజయ్ భూపతి - గట్టమనేని జయకృష్ణ మూవీ.. టైటిల్ ఇదే..!
Sunny Sanskari Ki Tulasi Kumari Is Now Streaming On Netflix
థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు కామెడీగా ఉందని పొగడగా, మరికొందరు కథలో కొత్తదనం తక్కువయిందని అభిప్రాయం తెలిపారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది, అయితే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో సినిమా ఎలా రాణిస్తుందో చూడాలి.
Also Read: ‘ఖైదీ 2’ సంగతేంటి లోకేష్..? ఉన్నట్టా..? లేనట్టా..?
ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ ఆడియోతో, అలాగే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో అందుబాటులో ఉంది. సినిమా నిడివి 134 నిమిషాలు, అంటే రెండు గంటలకు కొంచెం పైగా ఉంటుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాత OTTకు వచ్చిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘బద్రినాథ్ కి దుల్హనియా’, ‘ధడక్’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శశాంక్ ఖైతాన్ రూపొందించారు. సినిమా మొత్తం రంగురంగులుగా, వివాహ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. వరుణ్, జాన్వీ కెమిస్ట్రీ కూడా ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచింది.
Also Read: సైలెంట్ స్టార్ టూ బిలియనీర్.. ఒకే సినిమాతో కోట్లకి కోట్లు..!
సినిమాలో సాన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే మనీష్ పాల్, అక్షయ్ ఓబెరాయ్, అభినవ్ శర్మ వంటి నటులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు శశాంక్ కలిసి ధర్మ ప్రొడక్షన్స్, మెంటార్ డిసైపుల్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. అందమైన లొకేషన్స్, గ్రాండ్ వెడ్డింగ్ సెట్స్, మ్యూజిక్ అన్ని విజువల్ గా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేటర్స్‌లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ చిత్రం OTTలో ఎలా రాణిస్తుందో చూడాలి. రొమాంటిక్ కామెడీ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.
Follow Us