Khaidi 2: ‘ఖైదీ 2’ సంగతేంటి లోకేష్..? ఉన్నట్టా..? లేనట్టా..?

దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ 2’ ప్రారంభం ఆలస్యంగా చేస్తున్నారు. విక్రమ్ తర్వాత ఫ్యాన్స్ ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, లియో, కూలీ సినిమాలు చేసారు. లోకేష్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా ప్రణాళికలో ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
Khaidi 2

Khaidi 2

Khaidi 2: దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) అభిమానులను మరోసారి నిరాశపరిచినట్టున్నారు. చాలా కాలంగా ఆయన  ‘ఖైదీ 2’ ప్రారంభం కాకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. విక్రమ్ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత, ఫ్యాన్స్ కొత్త సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, లోకేష్ ఇప్పటివరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం లేదు.

విక్రమ్ తర్వాత, లోకేష్ వెంటనే ఖైదీ 2 ప్రారంభిస్తారని అంచనాలు ఉన్నప్పటికీ, ఆయన లియో, కూలీ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తృప్తిపరిచలేకపోవడంతో, లోకేష్ సీక్వెల్ పట్ల ప్రాధాన్యత తగ్గిపోయిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కూలీ పూర్తయిన వెంటనే ఖైదీ 2 ప్రారంభించాల్సిన నిర్ణయం ఉంది. అయితే లోకేష్ మళ్ళీ తిరిగి రజనీకాంత్ తో క‌లిసేందుకు ప్రయత్నించారు, కానీ అది సాధ్యంకాలేదు. దింతో ఫ్యాన్స్ ఖైదీ 2 స్టార్ట్ అవుతుందని అనుకున్నారు.

ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం, లోకేష్ తన తదుపరి సినిమాను KVN ప్రొడక్షన్స్ కింద ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక పెద్ద తెలుగు స్టార్ ప్రధాన పాత్రలో నటించనున్నారని అంచనా. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు కూడా వైరల్ అవుతున్నాయి, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇది పవన్ కల్యాణ్ అభిమానుల గుడ్ న్యూస్ అనే చెప్పాలి, లోకేష్ సినెమాటిక్ యూనివర్స్ (LCU) ఫ్యాన్స్ కోసం మరోసారి లాంగ్ వెయిట్ అవుతుందని తెలుస్తోంది. అంటే, ఖైదీ 2 కోసం మరిన్ని నెలలు, ఏకంగా సంవత్సరాలు కూడా ఎదురుచూడాల్సివచ్చే అవకాశముంది. మొత్తం మీద, లోకేష్ తన ఫ్యాన్స్ కోసం ఖైదీ 2ను ప్రారంభించడానికి ఇంకా పూర్తి ప్రణాళిక చేసుకోలేదని స్పష్టమవుతోంది. 

Advertisment
తాజా కథనాలు