/rtv/media/media_files/2025/11/27/srinivasa-mangapuram-2025-11-27-12-14-48.jpg)
Srinivasa Mangapuram
Srinivasa Mangapuram:గట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ గట్టమనేని(Gattamaneni Jayakrishna) తన తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని RX100, మంగళవారం లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్నారు.
Srinivasa Mangapuram PRE LOOK Released
తాజాగా సినిమా టీమ్ చిత్రం టైటిల్‌ను అలాగే ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త చిత్రం పేరును ‘శ్రీనివాస మంగాపురం’గా ప్రకటించారు. ఈ టైటిల్‌లో భారీ కథా నేపథ్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Two lives. One journey.
— G.V.Prakash Kumar (@gvprakash) November 27, 2025
Two hands. One promise.
Two hearts. One destiny.#AB4 is #SrinivasaMangapuram ❤️🔥
Get ready to witness a cult that will be a timeless chapter in the world of love stories💥
Shoot in progress.
First Look and more updates soon.
An @DirAjayBhupathi Film… pic.twitter.com/CtXcnz6DGC
Also Read: ‘ఖైదీ 2’ సంగతేంటి లోకేష్..? ఉన్నట్టా..? లేనట్టా..?
ప్రీ-లుక్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ చేతులు ఒకదానిపై ఒకటి ఉంచి ఉన్నట్టు చూపించారు. హీరో చేతికి గాయం ఉండగా, అతను పట్టుకున్న పాత గన్ పోస్టర్‌కు హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ తన చెయ్యిని నెమ్మదిగా అతని చేతిపై ఉంచడం ప్రేమతో పాటు ధైర్యాన్ని చూపిస్తుంది. వీరిముందు కనిపించే తిరుమల ఆలయం, చుట్టూ ఉన్న పర్వతాలు కథలో ఆధ్యాత్మికత ఉన్నట్టు చూపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై ప్రొడ్యూసర్ పి. కిరణ్, ప్రెజెంటర్‌గా అశ్వినీ దత్ కలిసి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా హీరో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ నుంచి వస్తున్న రాషా తదాని ఈ సినిమాతో తన తొలి తెలుగు సినిమాను ప్రారంభిస్తోంది. సినిమాకు సంగీతం యువ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.
Also Read: సైలెంట్ స్టార్ టూ బిలియనీర్.. ఒకే సినిమాతో కోట్లకి కోట్లు..!
సినిమా టీమ్ తెలిపిన ప్రకారం, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ను త్వరలోనే విడుదల చేయనున్నారు. అజయ్ భూపతి ప్రత్యేకమైన కథలకు, ఎమోషన్ కథలకు పేరొందిన దర్శకుడు కావడంతో, జయకృష్ణ మొదటి సినిమా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పటికే సినీ ప్రేక్షకులలో పెద్ద ఆసక్తి నెలకొంది. మొత్తానికి, గట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త హీరో, అజయ్ భూపతి దర్శకత్వం, పవర్ ఫుల్ టైటిల్ తో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి.
Follow Us