/rtv/media/media_files/2025/08/31/ustaad-bhagat-singh-2025-08-31-17-00-31.jpg)
Ustaad Bhagat Singh
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(ustaad-bhagat-singh) నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. అంతేకాదు రేపు పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్... గెట్ రెడీ అంటూ ట్వీట్ చేశారు. దీని ప్రకారం రేపు పవన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్ప్స్ లేదా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా
పోస్టర్ లో పవన్ హంటింగ్ హ్యాట్ ధరించి వింటేజ్ లుక్ అదిరిపోయారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ , ఎలివేషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది.
Also Read : బంపర్ ఆఫర్ పట్టేసిన 'టిల్లూ' గర్ల్ ఫ్రెండ్!
FULL MEALS TOMORROW at 4.45 PM ❤️🔥#UstaadBhagatSingh - Stay tuned!
— Mythri Movie Makers (@MythriOfficial) August 31, 2025
Our Director @harish2you presenting the man he loves in the way we all love him ❤️
This birthday special poster will be celebrated 💥💥
POWER STAR @PawanKalyan@harish2you@sreeleela14#RaashiiKhanna… pic.twitter.com/11XFEKP1SG
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. సాక్షి వైద్య, రాశీ ఖాన్న కూడా మరో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఏపీ ఎన్నికల ముందే సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో కొన్ని రోజులు బ్రేక్ పడింది. తిరిగి మళ్ళీ ఈ ఏడాది జూన్ లో ప్రారంభం అయ్యింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధిచిన షూటింగ్ పూర్తవగా.. ఇతర నటీనటులు పోర్షన్స్ షూట్ చేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన హరిహర వీరమల్లు చిత్రం పవన్ ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఆశలన్నీ ఉస్తాద్ , ఓజీ సినిమాల పైనే ఉన్నాయి. 'సాహో' ఫేమ్ సుజిత్ ఓజీ చిత్రానికి దర్శకత్వం వహించారు. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ ఓజస గంభీర పాత్రలో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 27న 'ఓజీ' థియేటర్స్ లో విడుదల కానుంది.