Cinema: బంపర్ ఆఫర్ పట్టేసిన  'టిల్లూ'  గర్ల్ ఫ్రెండ్!

'డీజే  టిల్లూ'  లో రాధిక పాత్రతో  యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. '

New Update
neha shetty

neha shetty

Neha shetty: 'డీజే  టిల్లూ'(DJ Tillu)  లో రాధిక పాత్రతో  యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి(Neha Shetty). ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. 'టిల్లూ'  తర్వాత ఇండస్ట్రీలో  ఈ అమ్మడు పేరు బాగా వినిపించింది.  అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. 

Also Read :  పింక్ అనార్కలీ డ్రస్‌లో మెరిసిపోతున్న కన్నడ బ్యూటీ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

పవన్ తో స్పెషల్ సాంగ్ 

నేహా  పవన్ కళ్యాణ్(Pawan Kalyan)  'ఓజీ'(OG) స్పెషల్ సాంగ్ లో మెరవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట మేకర్స్.  అందుకోసం నేహను ఎంపిక చేసుకున్నారట. నేహా గ్లామర్, యూత్ లో ఆమెకున్న ఫాలోయింగ్ సాంగ్ కి మరింత క్రేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమాలో 'వేయ్ రా చేయి వేయ్ రా' అనే పాట యువతను బాగా ఆకట్టుకుని పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి ఒక స్పెషల్ సాంగ్ ఉంటే,  సినిమాకు హైలైట్ గా ఉంటుందని భావిస్తున్నారట. 

ఇదిలా ఉంటే ఈ మధ్య  హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్  చేయడం ఇండస్ట్రీలో నడుస్తున్న కొత్త ట్రెండ్! హీరోయిన్స్ చేత స్పెషల్ సాంగ్స్ చేయించడం  ద్వారా  సినిమా రీచ్  పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇలా హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మెరిసిన చాలా ఐటం సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా  నిలిచాయి. ఉదాహరణకు.. సమంత  'ఓ అంటావా మావ',  పూజ హెగ్డే  'జిల్ జిల్ జిగేలు రాణి',  కాజల్  'పక్కా లోకల్',  తమన్నా  'రా నువ్వు కావాలయ్యా'!  ఇప్పుడు నేహా కూడా స్పెషల్ నెంబర్ తో ఆకట్టుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

టిల్లు తర్వాత వరుస పెట్టి ఆఫర్లు అందుకుంది నేహా శెట్టి. రూల్స్ రంజన్, బెదురు లంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. చివరిగా నేహా గతేడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది. 

సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తరచూ ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటో షూట్లు, వెకేషన్స్ కి సంబంధిచిన పిక్స్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. 

Also Read: Allu Arjun-Pawan Kalyan: కలిసిపోయిన మామ- అల్లుడు.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
తాజా కథనాలు