Nara Rohith : ఘనంగా నారా రోహిత్ పెళ్లి.. ఫోటోస్ చూశారా..!

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు అగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.

New Update
nararohith marriage

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్(nara rohith), నటి శిరీష లేళ్ల(siree lella) వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు అగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.  ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్, శిరీష ప్రతినిధి-2 సినిమాలో జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

గత ఏడాది అక్టోబర్‌ 13వ తేదీన వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.  తండ్రి మరణం కారణంగా వాయిదా పడిన వివాహం, ఇప్పుడు ఘనంగా జరగడంతో నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇందులో హల్దీ, పెళ్లి కొడుకు కార్యక్రమం, మెహందీ, సంగీత్ వంటి వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన వధూవరులు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ప్రస్తుతం రోహిత్ వయసు సుమారు 39 సంవత్సరాలు కాగా, శిరీష వయసు 28 సంవత్సరాలు.. ఇద్దరి మధ్య సుమారు 11 ఏళ్ల తేడా ఉంది.  బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు రోహిత్ . ఇటీవల సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

Also Read :  చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు తొలగింపు

పరిచయం ప్రేమగా మారి

ఇక శిరీష లేళ్లది పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల. బ్యాచిలర్ డిగ్రీ వరకు ఏపీలోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సినీ పరిశ్రమపై మక్కువతో విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చి, హైదరాబాద్‌లో తన అక్క వద్ద ఉంటూ ఆడిషన్స్‌కు హాజరయ్యారు. నారా రోహిత్ హీరోగా నటించిన 'ప్రతినిధి 2' సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది.

Also Read :  ప్రియుడితో క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి.. తేదీ ఖరారు..!

Advertisment
తాజా కథనాలు