Deep Fake Videos: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు తొలగింపు

మెగాస్టార్ చిరంజీవి పోరాటం ఫలించింది. సోషల్ మీడియాల్లో ఉన్న ఆయన వీడియోలను పోలీసులు తొలగించారు. ‘ఎక్స్‌’లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్‌ చేయించారు.

New Update
Chiranjeevi Deepfake Video

Chiranjeevi Deepfake Video

చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ముందుగా ఆ వీడియోలను మాత్రం తొలగించామని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాల్లో ఉన్న వీడియోలను తీసేశారు. సైబర్‌ నేరగాళ్లు చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, అశ్లీల వీడియోలు సృష్టించారు. ఐపీ ఎడ్రస్ ల ద్వారా వీటిని ఎక్కడ నుంచి పెట్టారనేది పోలీసులు కనుగొన్నారు. ఎక్స్‌’లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్‌ చేయించారు. ఫేక్‌ వీడియోలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. విదేశాల నుంచి వీటిని పెడుతున్నారని పోలీసులు తెలిపారు.  

Chiranjeevi Deepfake Video 

ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అదే క్రమయంలో టెక్నాలజీ ఉపయోగం కంటే దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఇది ముఖ్యంగా సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. అందులో ఎక్కువ డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల సెలబ్రెటీల పేరు, ప్రతిష్టకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ వల్ల ఎంతో మంది సెలబ్రెటీల మనోభావాలు దెబ్బతిన్నాయి.

ఇటీవల బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందన్నా, రజినీ కాంత్ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడి పోలీసులను ఆశ్రయించారు. కొందరు దుండగులు ఏఐని ఉపయోగించి చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. దాని ద్వారా అశ్లీల వీడియోలను క్రియేట్ చేశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, ఇతర వెబ్ సైట్లలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి రావడంతో ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. వెంటనే న్యాయపోరాటం మొదలు పెట్టారు. 

Advertisment
తాజా కథనాలు