Jr. NTR: జూ.ఎన్టీఆర్ కు యాక్సిడెంట్!

ప్రముఖ టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కు స్వల్పగాయాలే అయినట్లు ఆయన టీం సభ్యులు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
JR. NTR Accident

ప్రముఖ టాలీవుడ్ హీరో(Tollywood Hero) జూ.ఎన్టీఆర్(jr ntr) గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్(Pvt Ad Shooting) లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కు స్వల్పగాయాలే అయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Also Read :  ఘోర ప్రమాదం.. స్టార్ సింగర్ మృతి

Tollywood Hero Jr.NTR Accident

Also Read :  ఇదెక్కడి మాస్ రా మావా.. 'OG' కోసం ఫ్యాన్స్ చేసిన పనికి అంతా షాక్..

ప్రమాద వార్తలపై ఎన్టీఆర్ టీం స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. షూటింగ్ సమయంలో ఎన్‌టీఆర్ స్వల్ప గాయానికి గురయ్యారని తెలిపింది. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికి ఆయన వచ్చే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని ఎన్టీఆర్ టీం వెల్లడించింది. అయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అభిమానులు, మీడియా, ప్రజలందరూ ఎలాంటి ఊహాగానాలకు లోనుకాకుండా సహకరించాలని కోరింది. 

డ్రాగన్ షూటింగ్ కు బ్రేక్?

వార్-2 తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారన్న వార్తలు సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నాయి. వచ్చే ఏడాది మే 20న.. అంటే జూనియర్ బర్త్ డే గిఫ్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత జూన్ 25న ఈ సినిమా విడుదల ఉండేలా ప్లాన్  చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కు గాయం కావడం, రెండు వారల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. దీంతో విడుదల కూడా అనుకున్న సమయం కంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు