/rtv/media/media_files/2025/09/19/og-fans-celebrations-2025-09-19-14-15-09.jpg)
OG Fans Celebrations
OG Fans Celebrations: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం OG (They Call Him OG) ఈ నెల సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానుల్లో విశేషమైన ఆసక్తి నెలకొంది.
Idekkadaaaa masss ra mowaaa 🙏🏻🔥
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025
Atlanta fans….♥️#OG#TheyCallHimOGpic.twitter.com/GofCA49vYl
OG Car Show
తాజాగా అమెరికాలోని అట్లాంటా నగరానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమానినని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాపై ఉన్న ప్రేమను చూపించేందుకు వారు కార్ షో (Car Show by TAJ) పేరుతో ఓ అద్భుతమైన ఈవెంట్‌ను నిర్వహించారు.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో ఉన్న కార్లతో కలిసి OG అనే అక్షరాలను ఏర్పరిచారు. ముఖ్యంగా ఎరుపు, నలుపు రంగుల కార్లను వాడుతూ స్టైల్‌గా అక్షరాల రూపకల్పన చేశారు. డ్రోన్ కెమెరాలతో తీసిన ఏరియల్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ విజువల్ షోకేస్ చూసిన నెటిజన్లు ఫ్యాన్స్ క్రియేటివిటీకి, ఆర్గనైజేషన్‌కి ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం కార్ల పరేడ్ మాత్రమే కాదు, OG సినిమాపై ఉన్న పాజిటివ్ వైబ్‌ను ప్రపంచానికి చూపించాలన్న అభిమానుల ప్రయత్నం ఇది.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
ఇలాంటి క్యాంపెయిన్లు ఒకవైపు OG సినిమా క్రేజ్‌ను పెంచుతుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఉన్న అంతర్జాతీయ స్థాయి ఫ్యాన్ బేస్‌ను కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి OG సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితాలపైనే ఉంది. ఈ నెల 25న OG థియేటర్లలో ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి!