Singer Zubeen Garg Died: ఘోర ప్రమాదం.. స్టార్ సింగర్ మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ 52 ఏళ్ల వయస్సులో మృతి చెందారు. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ఆయన తుదిస్వాస విడిచారు. సింగపూర్ పోలీసులు అతన్ని సముద్రం నుండి రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

New Update
BREAKING

BREAKING

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ 52 ఏళ్ల వయస్సులో మృతి చెందారు. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ఆయన తుదిస్వాస విడిచారు. సింగపూర్ పోలీసులు అతన్ని సముద్రం నుండి రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ మెడికల్ కేర్‌లో ఉంచినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఆయన మరణించనట్లు వైద్యులు నిర్దారించారు. కాగా జుబీన్ సెప్టెంబర్ 20న నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి సింగపూర్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక మరణం అభిమానులను, మొత్తం అస్సామీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

Singer Zubeen Garg Died

ఆయన మరణంపై మాజీ రాజ్యసభ ఎంపీ రిపు బోరా X లో సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మన సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా బాధపడ్డాను. ఆయన స్వరం, సంగీతం, అజేయమైన స్ఫూర్తి అస్సాంలో మాత్రమే కాకుండా బయట కూడా స్ఫూర్తినిచ్చాయి. ఆయన కుటుంబం, అభిమానులు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి.’’ అంటూ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు