/rtv/media/media_files/2025/05/27/jnDuqOi1NYnZPBSRP4Dd.jpg)
Deepika Padukone-Sandeep Reddy Vanga
Deepika Padukone-Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి(Arjun Reddy), యానిమల్(Animal) సినిమాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని సందీప్ వంగా(Sandeep Vanga) షేక్ చేశాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు వాటి మీద అంతే విమర్శలు కూడా వచ్చాయి. అయితే సందీప్ వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ(Prabhas Spirit Movie) చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు. స్పిరిట్ మూవీలో దీపికా పడుకోణెను(Deepika Padukone) ముందు హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.
ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are....
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…
ఎ రేటెడ్ సీన్లు..
కానీ ఇప్పుడు యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సందీప్ వంగా ప్రకటించాడు. అయితే దీపికా ఎక్కువ కండీషన్లు పెట్టడం వల్ల దీపికాను వద్దని త్రిప్తి డిమ్రీను తీసుకున్నట్లు సమాచారం. సందీప్ వంగా సినిమాలు అంటే ఎ రేటెడ్ సీన్లు ఉంటాయి. సందీప్ వంగా అన్ ప్రొఫెషనల్ అని అందుకే మూవీ నుంచి తప్పుకున్నట్లు దీపికా పీఆర్ టీం ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై సందీప్ వంగా గట్టిగానే స్పందించాడు. డైరెక్ట్‌గా దీపికాకు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు.
ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
సందీప్ వంగా దీపికా పేరు పెట్టకుండా సోషల్ మీడియా ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను ఒక ఆర్టిస్టుకు కథ చెప్తే తప్పకుండా సినిమా చేస్తానని అర్థం. కానీ ఆ వ్యక్తి కథను పూర్తిగా బయట పెట్టి తన స్వభావాన్ని చాటి చెప్పారని ట్వీట్ చేశారు. కేవలం కథను బయట పెట్టడమే కాకుండా యంగ్ యాక్టర్‌ను తక్కువ చేయడం ఫెమినిజమా అని అన్నాడు. ఏళ్ల తరబడి ఒక సినిమా కోసం కష్టపడతామని, తన ప్రపంచం సినిమా అని, ఈ విషయం మీకు ఎప్పటికీ అర్థం కాదన్నాడు.
ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
తన మొత్తం కథను బయట పెట్టేసిన కూడా పర్లేదని, తనకి పోయేది ఏం లేదని.. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేశారు. అయితే దీపికను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్లు అందరికీ కూడా అర్థమైపోయింది. దీంతో నెటిజన్లు దీపికా పీఆర్ టీంపై మండిపడుతున్నారు.