Indian World Film Festival : ‘మంగళవారం’ దర్శకుడికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు!
8వ ‘ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో దర్శకుడు అజయ్ భూపతికి అరుదైన గౌరవం దక్కింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాకుగానూ ఉత్తమ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు అజయ్.