CYBER SCAM: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

సైబర్ స్కామర్లు కొత్త మోసానికి తెరతీశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సిమ్‌స్వాప్ చేసి రూ.7.5 కోట్లు కొట్టేశారు. అది గమనించిన ఆ వ్యాపారి పోలీసులను సంప్రదించారు. వెంటనే సైబర్‌ పోలీస్‌‌టీమ్‌ రూ.4.65 కోట్లను ఫ్రీజ్‌ చేసి నేరగాళ్లకు చిక్కకుండా ఆపగలిగింది.

New Update
Cyber scammers swapped SIM cards and stole Rs.7.5 crore

Cyber scammers swapped SIM cards and stole Rs.7.5 crore

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. మొదటగా మొబైల్ ఫోన్లకు లింకులు పంపించి దాన్ని క్లిక్ చేసిన వారి ఖాతా నుంచి డబ్బులు కొట్టేసేవారు. దాని గురించి ప్రజల్లో అవగాహన రావడంతో ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, సంపన్నులు, ప్రముఖ వ్యాపార, రాజకీయ, సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకున్నారు. 

Also Read: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం

ఇందులో భాగంగానే బాధితులకు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి బెదిరిస్తున్నారు. బాధితుల పేరుతో మనీలాండరింగ్ జరిగిందని.. పార్శిల్‌లో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని లేదా మరేదైనా కారణాలు చెప్పి భయపెడుతున్నారు. ఇది రహస్య ఇన్విస్టిగేషన్ అని.. ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా భాదితులపై కేసు నమోదు చేసినట్లు వాట్సాప్‌లో నోటీసులు పంపిస్తున్నారు.

Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

నెట్‌వర్క్ ప్రొవైడర్‌ ట్రిక్ చేసి

ఏకంగా వాట్సాప్ వీడియో కాల్‌లోనే పోలీసు అధికారులమంటూ, జడ్జిలమంటూ బెదిరించి కోట్లకు కొట్లు కొట్టేస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు మరో కొత్త మోసానికి తెరతీశారు. ఒక వ్యాపారవేత్త సిమ్ స్వాప్ చేసి రూ.7.5 కోట్లు కొట్టేశారు. గమనించిన బాధిత వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించగా.. కొంత డబ్బును సేవ్ చేయగలిగారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కాందివలీ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిమ్ స్వాప్ చేశారు కేటుగాళ్లు. మొదట నెట్ వర్క్ ప్రొవైడర్‌ను ట్రిక్ చేశారు. 

Also Read: ఇద్దరు మేనేజర్లను తొలగించిన చిరంజీవి.. అసలేం జరుగుతోంది?

అనంతరం ఆ వ్యాపారి ఫోన్ నెంబర్‌ను తమ దగ్గర ఉన్న సిమ్ కార్డుకు లింక్ చేశారు. దీంతో కేటుగాళ్లు పంపించే ఓటీపీలన్నీ తమవద్ద ఉన్న సిమ్ కార్డుకే వెళ్లాయి. తద్వారా వ్యాపారి ఖాతా నుంచి క్రమ క్రమంగా డబ్బులు దోచేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని బాధితుడు గుర్తించి 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్‌ను కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. 

Also Read: భార్యను చూసుకునేందుకు రిటైర్మెంట్‌ తీసుకున్న భర్త.. చివరికి ఊహించని షాక్

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంట వెంటనే బాధితుడి బ్యాంకు నోడల్ అధికారులను సంప్రదించారు. అనంతరం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా వెంట వెంటనే రియాక్ట్ కావడంతో సైబర్ పోలీస్ టీమ్ దాదాపు రూ.4.65 కోట్లు కేటుగాళ్ల ఖాతాకు వెళ్లకుండా ఆపగలిగింది. మిగతా మొత్తాన్ని అప్పటికే స్కామర్లు విత్ డ్రా చేసేశారని అధికారులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు