కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ ,బీబీపేట ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌ గా పని చేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి కనిపించకుండ పోవడం జిల్లాలో కలకలం సృష్టించింది.

New Update
kamareddy

kamareddy

Kamareddy: కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్‌ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువుఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Dead Body Parcel Case: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

అర్థరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు..ఎస్సై ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..భిక్కనూరు ఎస్సై సాయి కుమార్‌ సెల్‌ ఫోన్‌ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్‌ ఆఫ్‌ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు.

Also Read: AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బీబీపేట ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకి వచ్చారు. మధ్యాహ్నమైనా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్‌ లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు వారు చెప్పడంతో కంగారు పడిన  శ్రుతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు.

Also Read: Kazakhstan: కజకిస్తాన్‌ విమాన ప్రమాదంలో 38కి చేరిన మృతుల సంఖ్య

ఆమె ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సదాశివనగరం్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవరాం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్‌ శ్రుతి సెల్‌ తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్‌ సెల్‌ కూడా దొరికింది. భిక్కనూరు ఎస్సై సాయి కుమార్‌ కు చెందిన  కారు, చెప్పులు, నిఖిల్‌ చెప్పులు కనిపించాయి.

Also Read: చిరు, వెంకటేష్ తో పాటు.. సీఎం రేవంత్ ను కలిసే సినీ పెద్దల లిస్ట్ ఇదే!

అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. ఎస్సై ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వస్తుండడంతో ఏం జరిగి ఉంటుందన్నది తెలియడం లేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు