బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన మోక్షజ్ఞ లుక్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. డిసెంబర్ 05 న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. Also Read: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..! వాటిలో నిజం లేదు.. దీంతో ఈ సినిమా మొత్తానికే క్యాన్సిల్ అయిందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మాణ సంస్థ దీనిపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.' మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు గురించి ఊహాగానాలు వచ్చాయి. వాటిలో నిజం లేదు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటనలు/అప్‌డేట్స్‌ను @SLVCinemasOffl @LegendProdOffl సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీకు తెలియజేస్తాం. అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..' అని పేర్కొంది. Also Read: 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే AN IMPORTANT ALERT about our Next @PrasanthVarma - @MokshNandamuri Project.Please stop spreading fake news. All official information will come through official channels only.#PVCU2#MTejeswiniNandamuri @sudhakarcheruk5 @LegendProdOffl @ThePVCU pic.twitter.com/V9fXc7E0sy — SLV Cinemas (@SLVCinemasOffl) December 18, 2024 Also Read: రణ్ బీర్ తో అలాంటి ఫోటోలో కనిపించిన పాకిస్థాన్ బ్యూటీ.. తర్వాత పాపం ఆమె జీవితం.... దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. కాగా త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందనున్న ఈ సినిమాను లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. Also Read: వింటేజ్ వెంకీ మామ బ్యాక్.. పక్కా మ్యూజికల్ హిట్! సాంగ్ చూశారా