రణ్ బీర్ తో అలాంటి ఫోటోలో కనిపించిన పాకిస్థాన్ బ్యూటీ.. తర్వాత పాపం ఆమె జీవితం....

పాకిస్థానీ నటి మహీరా ఖాన్.. రణ్ బీర్ కపూర్‌తో స్మోకింగ్ చేస్తూ వైరలైన ఫొటోలు తనను ఎంతగా కదిలించాయో గుర్తుచేసుకున్నారు. ఆ సంఘటన తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ను చాలా ప్రభావితం చేసింది అని తెలిపింది మహీరా. 

New Update
mahira khan

Mahira khan: పాకిస్థానీ నటి మహీరా ఖాన్ బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గ్లామర్, నటన, అభినయంతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహీరా తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కున్న సవాళ్ళ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.  ఈ క్రమంలో  రణబీర్ కపూర్‌తో వైరల్ అయిన వివాదాస్పద ఫొటోలు తనను ఎంతగా కదిలించాయో గుర్తుచేసుకున్నారు.  2017లో న్యూయార్క్ వీధుల్లో రణబీర్ కపూర్‌తో కలిసి మహీరా స్మోకింగ్ చేస్తూ కనిపించిన ఫొటోలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫొటో వీరిద్దరి గురించి రకరకాల ఊహాగానాలు దారితీసింది. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

రణ్ బీర్ కపూర్‌తో స్మోకింగ్ ఫొటో 

దీనిపై మహీరా మాట్లాడుతూ.. ఆ ఫోటో వివాదం తనను మాసికంగా ఎంతో కృంగదీసిందని చెప్పుకొచ్చింది. "ఒక రోజు స్మోక్ చేస్తున్న ఫోటోతో పాటు  ఓ ఆర్టికల్ చదివిన తర్వాత.. ఇక నా కెరీర్  ముగిసిపోయిందా..? అనే ప్రశ్న నాలో తలెత్తింది. ఆ కథనంలో ఈ మహిళ పాకిస్థాన్ లో అందరికంటే ఎక్కువ విజయాన్ని సాధించింది. ఎన్నో ప్రకటనలు చేసింది.. ఎంతో స్టార్ డమ్ సంపాదించింది.. ఇక ఇప్పుడు అదంతా పోయింది.. ఆమెకు ఏం జరగబోతుంది అని రాసి ఉంది. ఆ కథాన్ని చదివిన నా కెరీర్ ముగిసిపోవచ్చని భావించాను. ప్రతిరోజు ఏడ్చాను. కొన్ని సార్లు మంచం నుంచి లేవడానికి కూడా ఇష్టపడలేదు. ఆ సంఘటన నా వ్యక్తిగత జీవితం, కెరీర్ ను చాలా ప్రభావితం చేసింది" అని తెలిపింది మహీరా. 

అలాగే మహీరా మాట్లాడుతూ.. ఒంటరి తల్లిగా ఉన్న తనకు.. ఈ సంఘటన జీవితంలో మరొక కష్టాల పొరను జోడించింది తెలిపింది. ఆ కష్టసమయంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ తన పిల్లల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగత నిర్ణయాలపై దృష్టి సారించి సానూకూలంగా ఉండాలని ఎంచుకున్నట్లు చెప్పింది. 

Also Read:  2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు