వింటేజ్ వెంకీ మామ బ్యాక్.. పక్కా మ్యూజికల్ హిట్! సాంగ్ చూశారా

విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాము'. తాజాగా ఈ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. మీను అంటూ సాగిన ఈ మెలోడీ విజువల్స్ వింటేజ్ వెంకీ మామను గుర్తుచేస్తున్నాయి. ఈ సాంగ్ మీరూ చూసేయండి

New Update

వింటేజ్ వెంకీ మామ.. 

మీను.. టింగ .. టింగ.. మీను అంటూ సాగిన ఈ మెలడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పాటలో భీమ్స్ మ్యూజిక్ హాలైట్ గా అనిపించింది. మీనాక్షి, ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ కాంబోలో సాగిన ఈ పాటలోని విజువల్స్ వింటేజ్ వెంకీ మామను గుర్తుచేస్తున్నాయి. ఈ  వెంకటేష్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షితో లవ్ స్టోరీ గురించి తన భార్యకు పాట రూపంలో చెబుతాడు.  భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఈ మెలడీని పాడారు. 

 

ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టు మీద' సాంగ్  సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. పాపులర్ సింగర్ రమణ గోగుల వాయిస్ తో ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో రెండు పాటలకు వస్తున్న రెస్పాన్స్  చూస్తుంటే ఈ సారి వెంకీ మామ మంచి మ్యూజికల్ హిట్ కొట్టబోతున్నట్లు అనిపిస్తోంది. 

Also Read: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు