/rtv/media/media_files/2025/10/02/shivajyothi-2025-10-02-14-45-04.jpg)
Shivajyothi
బిగ్ బాస్ శివ జ్యోతి(Bigg Boss Shiva Jyothi) దసరా(Dasara 2025) సందర్భంగా గుడ్ న్యూస్‌ను తెలిపింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో తనకు పాప లేదా బాబు పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. వీరికి పెళ్లి అయి పదేళ్లు అయ్యింది. ఇప్పటి వరకు వీరికి పిల్లలు పుట్టలేదు. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పుట్టడం లేదని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల శివజ్యోతి వీడియోలు, ఫొటోలు చేసి పలువురు ఆమె గర్భవతి అని జోరుగా ప్రచారం అయితే జరిగింది. ఫైనల్‌గా ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. శివ జ్యోతి సావిత్రిగా గుర్తింపు పొందింది.
బిగ్ బాస్ శివ జ్యోతి దసరా సందర్భంగా గుడ్ న్యూస్ తెలియజేసింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో తనకు పాప లేదా బాబు పుట్టబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.https://t.co/3XEeKs4cuP…
— RTV (@RTVnewsnetwork) October 2, 2025
Also Read : వరుణ్ తేజ్-లావణ్య దంపతుల కొడుకు పేరేంటో తెలుసా?
తీన్మార్ వార్తలతో ఫేమస్..
తీన్మార్ వార్తలతో గుర్తింపు సంపాదించుకుని బిగ్ బాస్‌లోకి వెళ్లింది. ఇందులోకి వెళ్లిన తర్వాత ఇంకా ఫేమ్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటుంది. అయితే ఆమె తల్లి కాబోతున్నట్లు దసరా సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఏడు కొండల వెంకన్నస్వామి దయతో వచ్చే ఏడాది బిడ్డ రాబోతుందని తెలిపింది. తమ పిల్లల కోసం ఎంతగానో మీరు కూడా వేచి చూశారు. సొంత అక్క, బావకు ఒక బేబీ రావాలని గట్టిగా కోరుకున్నారు. ఈ విషయం తెలిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని, అందుకే పండుగ రోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎవరూ కూడా దిష్టి పెట్టవద్దు.. ఆశీర్వదించండని ఆమె అన్నారు. తన జర్నీలో సపోర్ట్ చేసిన వారిని అసలు మర్చిపోను అని ఆమె తెలిపారు.
Also Read : ఇక థియేటర్స్ లో బాలయ్య తాండవమే.. అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్