Akhanda 2 Release Date: ఇక థియేటర్స్ లో బాలయ్య తాండవమే.. అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్

బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

New Update

Akhanda 2:  బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5న అఖండ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య త్రిశూలం పట్టుకొని పవర్ ఫుల్ లుక్ కనిపించారు. అయితే సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. రీ రికార్డింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి  కాకపోవడంతో విడుదలను వాయిదా వేసినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అఖండ పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దీంతో పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే.. పార్ట్ 1 మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, గ్రాండ్ విజువల్స్ ఉండనున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సాధువు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు రియలిస్టిక్ ఫీల్ కలిగించడానికి మహా కుంభమేళా వంటి ఆద్యాత్మిక ప్రదేశాల్లో చిత్రీకరించారు.

బాలయ్య కూతురు తేజశ్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట,  గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తిన్నారు. ఈ సారి తమన్ మ్యూజిక్ తో థియేటర్లు దద్దరిల్లిపోనున్నట్లు తెలుస్తోంది. తమన్ వరుస చాట్ బస్టర్లతో ఫుల్ ఊపుమీదున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఓజీ తమన్ మ్యూజిక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది. పవర్ స్టార్    ప్రతి ఎంట్రీ సీన్ లో తమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పించింది . సినిమా మూడ్ కి తగ్గట్లుగా మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు అఖండ2 కోసం కూడా తమన్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి బాలయ్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఇది ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచింది. సంయుక్త మీనన్, ప్రగ్య జైశ్వాల్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. 'బజరంగీ భాయిజాన్' చైల్డ్ ఆర్టిస్ట్  హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. బాలయ్య,హర్షలి మధ్య ఇంటెన్స్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Also Read: Megastar MSG: మెగా ఆల్బమ్ లోడింగ్..  'మన శంకర వర ప్రసాద్ గారు' నుంచి పిచ్చెక్కించే ఫస్ట్ సింగిల్!

Advertisment
తాజా కథనాలు