/rtv/media/media_files/1JR93lv9QTubgT6Ts4jQ.jpg)
this week ott movies
సెప్టెంబర్ నెల సినీ ప్రియులకు(September movies) పెద్ద పండగల ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెద్ద చిత్రాలు బాక్స్ ఆఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు పలు చిన్న చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి. అనుష్క 'ఘాటీ' నుంచి మొదలై పవన్ కళ్యాణ్ 'ఓజీ' వరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ కళకళగా మారనుంది. గత నెల మించిన వినోదాలతో సెప్టెంబర్ సిద్ధమైంది. మరి ఈనెల ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైన సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు
సెప్టెంబర్ మూవీస్
ఘాటీ
సెప్టెంబర్ మొదటి వారం వినోదాలను పంచేందుకు లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి 'ఘాటీ'(Anushka Shetty Ghaati) సినిమా సిద్ధమైంది. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఆంధ్ర - ఒడిస్సా బార్డర్ లో గంజాయి స్మగిలింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో అనుష్క మునుపెన్నడూ కనిపించని విధంగా ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించనుంది.
మదరాశి
'ఘాటీ' తో పాటు శివకార్తికేయన్ 'మదరాశి'(Madharaasi movie) కూడా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో సందడి చేయనుంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు.
మిరాయ్
ఇక సెప్టెంబర్ రెండవ వారంలో తేజ సజ్జ 'మిరాయి'(Mirai) బాక్సాఫీస్ విందుకు సిద్ధమైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ సజ్జ ఒక సూపర్ యోధాగా కనిపించబోతున్నాడు. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రేయ, మంచు మనోజ్, జయరామ్, జపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, గ్లిమ్ప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
కాంత
దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా కాంత(Kantha Movie) కూడా సెప్టెంబర్ 12న బాక్సాఫీస్ పోటీకి సిద్ధమైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగు రెండు భాషల్లో తెరకెక్కించారు. 1954 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు.
కిష్కిందపూరి
బెల్లంకొండా శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కిష్కిందపురి(kishkindhapuri) చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను భయపెడుతున్నాయి. థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని తెలుస్తోంది
ఓజీ
ఇక సెప్టెంబర్ చివరి వారంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'(og) వినోదాలను పంచనుంది. సుజీత్- పవన్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఓజీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
Also Read: Ghaati Advance Ticket Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'ఘాటీ' సంచలనం.. హాట్ కేకుల్లా టికెట్లు !