Raj Tarun - Lavanya: హీరో రాజ్‌ తరుణ్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు

రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి మాజీ ప్రేయసి లావణ్య ఇవాళ ఉదయం నర్సింగ్ PSలో కొత్త ఫిర్యాదు చేసింది. జూన్ 30న రాజ్ తరుణ్, అతని సహచరులు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించింది. బంగారం ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో నర్సింగ్ PSలో కేసు నమోదైంది.

New Update
Raj Tarun - Lavanya

Raj Tarun - Lavanya

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతడి మాజీ ప్రేయసి లావణ్య ఇవాళ ఉదయం నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కొత్త ఫిర్యాదు చేయడంతో  రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. జూన్ 30న రాజ్ తరుణ్, అతని సహచరులు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని లావణ్య తన వాంగ్మూలంలో ఆరోపించారు. అంతేకాకుండా వారు బంగారం ఎత్తుకెళ్లారని కూడా ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. 

Raj Tarun - Lavanya Issue

అక్కడితో ఆగకుండా వారు అడ్డుకున్న తన తండ్రిపై దాడి చేశారని.. తన పెంపుడు కుక్కను సైతం చంపారని ఆమె పేర్కొంది. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు చేరడంతో.. ఆయన ఆదేశాల మేరకు.. నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పుడిది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ కేసు ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి. 

ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ - లావణ్యల వ్యవహారం గత ఏడాది నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్నానని గతంలో లావణ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని.. తనను శారీరకంగానూ, మానసికంగానూ.. ఇలా అన్ని విధాలుగా వాడుకున్నాడని నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. 

అక్కడితో ఆగకుండా రాజ్ తరుణ్ తనను గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించాడని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించింది. అతడు మరో నటి మాల్వి మల్హోత్రాతో రిలేషన్‌లో ఉండి.. తనను వదిలేశాడని గతంలో రచ్చ రచ్చ చేసింది. ఎన్నో ఏళ్లుగా తనతో రిలేషన్‌లో ఉండి.. ఇప్పుడు వేరొక అమ్మాయితో ఉన్నాడని.. అందువల్లే తనను దూరం చేయడం ప్రారంభించాడని తెలిపింది. 

తాను ఎన్నో భావోద్వేగ వేధింపులకు గురయ్యానని.. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని పేర్కొంది. అయితే లావణ్య చెప్పిన విషయాలను రాజ్ తరుణ్ ఖండించాడు. లావణ్య ఆరోపణలు అన్నీ కల్పితమైనవని.. తన పేరు, ప్రతిష్టతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని వాదించాడు. ఆమెకు తప్పుడు కేసులు పెట్టే అలవాటు ఉందని.. వ్యక్తిగత కారణాల వల్లే తాము విడిపోయామని రాజ్ తరుణ్ గతంలో వివరించాడు. 

ఈ కేసు అనంతరం కోకాపేటలోని పుప్పాలగూడలో రాజ్ తరుణ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు, లావణ్యకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ ఇంటి గొడవ కూడా కొన్నాళ్లు నడిచింది. ఇలా బెదిరింపులు, వేధింపులు, ఆస్తి వివాదాలు, ఇప్పుడు హింస ఆరోపణలతో వీరి వివాదం మరింత పెరిగింది. 

Advertisment
తాజా కథనాలు