Ghaati Advance Ticket Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'ఘాటీ' సంచలనం.. హాట్ కేకుల్లా టికెట్లు !

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి  నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా  'ఘాటీ'. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది.

New Update

Ghaati Advance Ticket Booking: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి  నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా  'ఘాటీ'. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి మూవీ అడ్వాన్స్  బుకింగ్స్ ప్రారంభమవగా... టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుక్ మై షోలో ఇప్పటికే పలు థియేటర్లు హౌజ్ ఫుల్ చూపిస్తున్నాయి. మొత్తానికి  'ఘాటి' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.  అరుంధతి',  'భాగమతి' లాంటి సినిమాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో  వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.   ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లోనూ విడుదల అవుతుంది.

యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

గంజాయి స్మగిలింగ్ నేపథ్యంలో 

గంజాయి స్మగిలింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ కథ ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో జరుగుతుంది. ఇందులో అనుష్క శీలావతి అనే పాత్రలో నటించారు. ఒక సాధారణ బస్ కండక్టర్ గా జీవితం సాగిస్తున్న అనుష్క స్మగిలింగ్ లో ఎలా భాగమైంది. ఆ తర్వాత స్మగిలింగ్ సామ్రాజ్యానికే రాణిగా ఎలా ఎదిగింది అనేది సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా క్రిష్ దీనిని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

'ఘాటీ' లో అనుష్క మునుపెన్నడు కనిపించని విధంగా ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. వేదం తర్వాత అనుష్క - క్రిష్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. 

Advertisment
తాజా కథనాలు