అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్!

అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.

New Update
allu arjun press meet

allu arjun press meet Photograph: (allu arjun press meet)

అల్లు అర్జున్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవలే 4 వారాలపాటు మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన సంధ్య థియేటర్ ఘటనపై ప్రెస్‌మీట్ పెట్టడం మరింత దుమారం రేగుతోంది. కేసు కోర్టులో ఉండగానే.. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం కూడా తనకు తెలీదని బన్నీ ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఆ మరుసటి రోజు ఆమె చనిపోయిన విషయం తెలిసి షాక్‌కి గురయ్యానన్నారు.

Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని!

పోలీసులు కలవలేదు : బన్నీ

సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారని అంటున్నారని.. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తనను పోలీసులు కలవలేదని చెప్పారు. తనపై తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారని ఆవేదన చెందారు. తాను అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తర్వాతే థియేటర్ వెళ్లానని చెప్పారు. తాను రోడ్ షో చేయలేదన్నారు. ఇక సినిమా చూస్తున్న సమయంలో జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.

Also Read: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్

దీంతో అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. 

Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్

బన్నీ ప్రెస్‌మీట్‌తో ఉదృతం

బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఇది మరింత ఉదృతం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు సైతం సీరియస్ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడిన అనంతరం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం దుమారం రేపుతోంది. అదీకాకుండా ఈ కేసు కోర్టులో ఉండగానే బన్నీ బయటకొచ్చి ఇలా ప్రెస్‌మీట్‌ పెట్టడంతో దర్యాప్తును ప్రభావితం చేస్తున్నట్లు భావించి పోలీసుల సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు