SCR: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు . తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లను రద్దు చేయటంతో పాటు మరికొన్నింటిని రూట్ మార్చారు.పలు రూట్లలో సిగ్నలింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుండగా.. విజయవాడ-కాజీపేట మధ్య మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఉంటుందని అధికారులు చెప్పారు.
Also Read: AP: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు
ఈ నెల 26 నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు ఈ విషయాలను ట్రైన్ ప్రయాణికులు గమనించాలన్నారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 28 వరకూ కాచిగూడ-మిర్యాలగూడ, మిర్యాలగూడ-నడికుడి రైలును రద్దు చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ వయా విజయాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరు ఎక్స్‌ప్రెస్ ని అధికారులు రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి మార్చి 1వ వరకూ నడికుడి-మిర్యాలగూడ , మిర్యాలగూడ-కాచిగూడ రైలుని రద్దు చేశారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!
గుంటూరు-సికింద్రాబాద్- గుంటూరు గోల్కండ ఎక్స్ ప్రెస్ ఈ నెల 27 నుంచి జనవరి 9 తేదీ వరకూ గుంటూరు నుంచి కాజీపేట వరకూ నడుస్తుందన్నారు. తిరిగి కాజీపేట నుంచి గుంటూరు వెళుతుందని తెలిపారు.ఈ నెల 26 నుంచి జనవరి 8 వరకు విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా వెళ్తుందని అధికారులు చెప్పారు.
Also Read: Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు
జనవరి 6 నుంచి 9 వరకూ షాలిమార్-హైదరాబాద్, జనవరి 7 నుంచి 9 తేదీ వరకు హైదరాబాద్- షాలిమార్ నడుస్తాయని చెప్పారు. వాడి-వికారాబాద్-సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు- విజయవాడ మీదుగా పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.జనవరి 7న సాయినగర్ షిర్డీ – కాకినాడ పోర్టు ట్రైన్, జనవరి 8న కాకినాడ పోర్టు – సాయినగర్ షిర్డీ ట్రైన్, జనవరి 7న మచిలీపట్నం – సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్, సాయినగర్ షిర్డీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూట్ మార్చారు.
Also Read: CPI: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ!
జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ముంబై సీఎస్‌ఎంటీ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలు కొనసాగించాలని అధికారులు తెలిపారు.