సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్‌పై వచ్చిన అల్లు అర్జున్.. రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత ఉదృతమైంది. ఇందులో భాగంగానే నిన్న (ఆదివారం) అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది.
ఓయూ జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై దాడిచేశారు. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బాడీగార్డ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కొందరు తిరగబడ్డారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ వారు ఆరోపించారు. వెంటనే రేవతి కుటుంబానికి బన్నీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి
Also Read: అల్లు అర్జున్‌పై ప్రెస్‌మీట్.. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ శాఖ సీరియస్
అంతేకాకుండా రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని జేఏసీ నాయకులు కోరారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకి చేరుకుని జేఏసీ నాయకులని అదుపులోకి తీసుకున్నారు.
అలసత్వాన్ని సహించేది లేదు
దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!
చట్టం తనపని తాను చేసుకుపోతుంది
ఇక ఇదే ఘటనపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. శాంతి భద్రతలకు విఘాతం కలించేలా ఎవరూ ప్రవర్తించవద్దన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్
‘‘సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’.