ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం అల్లుఅర్జున్ ఇంటిపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. '' సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని'' రేవంత్ రాసుకొచ్చారు.
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు!
ఇదిలాఉండగా ఆదివారం మధ్యాహ్నం ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బాడీగార్డ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కొందరు తిరగబడ్డారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ ఆరోపించారు. వెంటనే రేవతి కుటుంబానికి బన్నీ క్షమాపణలు చెప్పాలని, రూ.కోటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే జేఏసీ నాయకులు, అల్లు అర్జున్ బాడీగార్డ్‌ల మధ్య దాడులు జరిగాయి. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..!
మరోవైపు సీఎం రేవంత్ శనివారం సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడారు. అతడు థియేటర్‌లో సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని.. కానీ థియేటర్‌కు వెళ్ళేటప్పుడు కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోగా.. కుమారుడు కోమాలోకి వెళ్లాడని తెలిపారు. సినిమా చూసేందుకు వచ్చి రేవతి చచ్చిపోతే ఆమె కుటుంబాన్ని చూడటానికి కూడా అల్లు అర్జున్ కానీ, సినీ ప్రముఖులు కానీ వెళ్లలేదని మండిపడ్డారు. ఆ తర్వాత శనివారం రాత్రి అల్లుఅర్జున్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలను ఖండించారు.
Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు
Also Read: సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్