Sanam Shetty Viral Comments: నటన కోసం కాదు, వారితో పడుకోవడానికి కాల్స్.. ఆ నిర్మాతలపై నటి సంచలన ఆరోపణలు!

కోలీవుడ్ నటి సనమ్ శెట్టి తమిళ పరిశ్రమ పని సంస్కృతి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ పరిశ్రమలో లింగ వివక్షను ఎత్తిచూపారు. అలాగే చాలా మంది చిత్రనిర్మాతలు నటనా నైపుణ్యాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నటీమణులను సంప్రదిస్తారని ఆరోపించింది.

New Update
Sanam Shetty comments

Sanam Shetty Viral Comments

Sanam Shetty Viral Comments: కోలీవుడ్ నటి సనమ్ శెట్టి తమిళ చిత్రపరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసింది. అక్కడ  పని సంస్కృతి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తమిళ ఇండస్ట్రీలో లింగ వివక్ష ఉందని ఎత్తి చూపారు. సమానత్వం గురించి సినిమాలు తీసేముందు ముందు నటీనటులను సమానంగా గౌరవించాలని చిత్రనిర్మాతలపై విమర్శలు చేసింది. పురుష నటులను గౌరవంగా చూస్తారు. కానీ మహిళ నటులను అదే విధంగా చూడరని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే

వారితో పడుకోవడానికి కాల్స్ 

నేను నా వ్యక్తిగత అనుభవం నుంచిమాట్లాడుతున్నాను. చాలా మంది తమిళ చిత్రనిర్మాతలు సినిమాల్లో నటించడానికి  కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నటీమణులను సంప్రదిస్తారు. సినిమా పాత్రల కోసం వారు మమ్మల్ని పిలుస్తున్నారని అనుకుంటాం.  కానీ, వాస్తవానికి మమ్మల్ని వారితో పడుకోవడానికి  పిలుస్తున్నారు" అంటూ సంచలన ఆరోపణలు చేసింది సనమ్.  పరిశ్రమలో మార్పు కోసం పిలుపునిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా అప్‌లోడ్ చేసింది.

Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం

Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!


సనమ్ శెట్టి  మహేష్ బాబు  'శ్రీమంతుడు' సినిమాలో మేఘన పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు "సింగం 123" లలో సహాయక పాత్రను పోషించింది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. 2019 తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. సోషల్ మీడియాలో కూడా తరచూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. 

Also Read: Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్! 

Advertisment
Advertisment
తాజా కథనాలు