/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Malayalam-Movies.jpg)
Malayalam film industry: 2024లో మలయాళ చిత్ర పరిశ్రమ 'ఆవేశం,' 'ఏఆర్‌ఎమ్,' 'ప్రేమలు,' 'మంజుమెల్ బాయ్స్' వంటి సినిమాలతో పెద్ద విజయాలను సాధించింది. అంతేకాదు కరోనా తర్వాత ఓటీటీల ద్వారా కూడా మలయాళ చిత్రాలకు ఇతర భాషల ప్రేక్షకాదరణ బాగా పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (KFPA) , కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వంటి ప్రధాన సంఘాలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మెకి దిగుతున్నట్లు ప్రకటించాయి. జూన్ 01 నుంచి మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి అన్ని బంద్ కానునట్లు పేర్కొన్నారు.
#Malayalam Film Industry may go for a complete shutdown from 01st June’25.
— Aakashavaani (@TheAakashavaani) February 15, 2025
A person from the producers association says ‘The remuneration the actors are demanding is at least TEN times higher than what Malayalam cinema can afford and this needs to be corrected as soon as… pic.twitter.com/dfTT5kM7QO
జూన్ 1 నుంచి అన్నీ బంద్
అయితే కేరళలో ఎంటర్ టైన్మెంట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండడం.. దానికి తోడు నటీనటులు, టెక్నీషియన్లు భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాలను వ్యతిరేకిస్తూ పలు అసోసియేషన్స్ నిరసనలు చేసేందుకు సిద్ధమయ్యారు. జూన్ 1 నుంచి అన్ని షూటింగులు, సినిమా స్క్రీనింగ్ లు నిలిపివేయాలని సినిమాటోగ్రాఫర్ సంఘాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కేరళ అధ్యక్షుడు, ప్రముఖ ప్రొడ్యూసర్ గి. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మలయాళ సినిమాకు 30% పన్ను వేస్తోంది.. ఇందులో GST కూడా ఉంది. దీనివల్ల పరిశ్రమ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటోంది. కావున ప్రభుత్వం ఈ పన్నును ఉపసంహరించాలి అని కోరారు.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!