Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం

విక్కీ కౌశల్ హీరోగా విడుదలైన హిస్టారికల్ డ్రామా 'చావా' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 70 కోట్ల మార్క్ చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే తొలి వారాంతంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు.

New Update
Chhaava Teaser : గూస్ బంప్స్ తెప్పిస్తున్న రష్మిక కొత్త సినిమా 'చావా' టీజర్.. యుద్ధ వీరుడిగా బాలీవుడ్ హీరో

Chhaava day 2 collections

విక్కీ కెరీర్ లో బిగ్గెస్ట్  ఓపెనర్

ఆక్యుపెన్సీ విషయానికి వస్తే రెండవ రోజు ఈ చిత్రం మొత్తం 50.39% ఆక్యుపెన్సీ సాధించింది. ఉదయం షోలలో  32.91%, మధ్యాహ్నం 47.06%, సాయంత్రం 52.57% తో మరింత పెరిగింది. రాత్రి షోలలో  - 69.02%.తో అత్యధిక ఆక్యుపెన్సీ రేటు కనిపించింది.  విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్  ఓపెనర్ గా  ఛావా నిలిచింది. 

విక్కీ కౌశల్ నటనకు ఫిదా

ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ భార్య ఏసు బాయ్ పాత్రలో రష్మిక నటించింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విక్కీ శంభాజీ పాత్రకు జీవం పోశారని చెబుతున్నారు. అంతేకాదు సినిమా చూసిన కొంతమంది ఆడియన్స్ కన్నీటితో బయటకు వస్తున్నారు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని రివ్యులు వస్తున్నాయి.  బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న.. శంభాజీ మహారాజ్ జీవిత కథను సినిమాగా మలిచి ఎంతో అద్భుతంగా చూపించారు డైరెక్టర్ లక్ష్మణ్. 

Also Read:Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!

Advertisment
తాజా కథనాలు