/rtv/media/media_files/2025/11/07/vrusshabha-2025-11-07-17-34-49.jpg)
Vrusshabha
Vrusshabha: మోహన్‌లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం "వృశ్భ" 2025 డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మహాకావ్య కథను మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సరికా, అజయ్, నేహా సక్సెనా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
“వృశ్భ” చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు శోభా కపూర్, ఎక్టా ఆర్ కపూర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రం విడుదల తేదీని ఇటీవల ఒక చిన్న ప్రోమోతో ప్రకటించారు. ప్రోమో ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. "వృశ్భ" ఒక మంచి థియేట్రికల్ అనుభవాన్ని అందించే సినిమా అని చిత్ర బృందం చెబుతోంది.
ఈ భారీ చిత్రం మోహన్‌లాల్ అభిమానులకు మాత్రమే కాకుండా, అన్ని భాషల ప్రేక్షకులకి కూడా అద్భుతమైన సినిమా అనుభవం ఇవ్వాలని తెరకెక్కిస్తున్నారు. అందుకే, ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. మొత్తంగా, “వృశ్భ” ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అనుభవాన్ని ఇవ్వబోతోంది.
Follow Us