Salman Khan: భారత్, పాక్ సీజ్‌ఫైర్‌.. ఒక్క పోస్టుతో చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. వెంటనే డిలీట్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణపై ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సిందూర్ గురించి ఎందుకు స్పందించలేదని.. ఇప్పుడెందుకు రియాక్ట్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.

New Update
salman khan post on india pakistan ceasefire gets backlash fans fire

salman khan post on india pakistan ceasefire gets backlash fans fire

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా అతడు చేసిన ట్వీట్‌పై సినీ ప్రియులు మండిపడుతున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య గత వారం రోజులుగా యుద్ధ వాతావరణం వేడెక్కింది. నిన్న (శనివారం) ఇరు దేశాలు కాల్పుల విరమణ తీసుకున్నాయి. దీంతో సల్మాన్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. 

Also Read :  రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

చిక్కుల్లో సల్మాన్ ఖాన్

ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు పెట్టారు. ‘‘Thank god for the ceasefire’’ (సీజ్‌ఫైర్‌ కు దేవునికి ధన్యవాదాలు) అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. వెంటనే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్, పాక్ కాల్పుల విరమణపై సల్మాన్ రియాక్ట్ కావడంతో ఓ వర్గం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో సల్మాన్ పై ఫుల్ పైర్ అయ్యారు. దీంతో నెటిజన్లు అతడిపై విమర్శలు గుప్పించారు. 

ఇన్ని రోజులు ఆపరేషన్ సిందూర్ పై ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని సల్మాన్‌ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎందుకు స్పందించలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఒక్క ట్వీట్ కూడా లేదు.. ఎందుకు?.. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మీరెందుకు ఏమీ చెప్పలేదు అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. దీంతో సల్మాన్ వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. 

Also Read :  ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

అయితే కొంతమంది మాత్రం సల్మాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అందులో సల్మాన్ తప్పేముంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా సల్మాన్ ట్వీట్ పెట్టిన తర్వాత.. పాకిస్తాన్ సీజ్ ఫైర్‌ను ఉల్లంఘించిందనే వార్త రావడంతోనే ఆయన తన ట్వీట్‌ను డిలీట్ చేశారని కొందరు సమర్ధిస్తు్న్నారు. ఇక్కడ సల్మాన్ తప్పేముంది? అని తిరిగి కామెంట్లు పెడుతున్నారు. 

Also Read :  మోదీ ఇంత వీక్ అనుకోలేదు.. ప్రతీ భారతీయుడిని కించపరిచాడు.. హర్ష కుమార్ ఎమోషనల్

Also Read :  ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!

telugu-news | latest-telugu-news | operation Sindoor | ind pak war | salman

#salman #ind pak war #operation Sindoor #latest-telugu-news #telugu-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు