Saif Ali Khan: నాన్న నువ్వు చచ్చిపోతావా..కొడుకు మాటలు గుర్తు చేసుకున్న సైఫ్‌!

దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ మొదటి సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన దాడి జరిగినప్పుడు తన కుమారుడు తైమూర్‌ మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.

New Update
saif case updates

saif case updates Photograph: (saif case updates )

దుండగుడి దాడిలో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ గాయపడిన విషయం తెలిసిందే.ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.దాడి తరువాత మొదటి సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్‌..ఆ రోజు తన కుమారుడు తైమూరు మాటలను గుర్తు చేసుకున్నారు. కత్తితో పొడిచినట్లు మొదట తనకు తెలియలేదని చిన్న గాయం అయిందనుకున్నట్లు సైఫ్‌ అన్నారు.

Also Read: Bangladesh:బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌ డేవిల్‌ హంట్‌..1300 మంది అరెస్ట్‌!

తరువాత వీపు భాగంలో నొప్పి రావడంతో కత్తితో దాడి చేసినట్లు తెలిసిందన్నారు. నాకు వీపులో విపరీతమైన నొప్పి కలిగింది. అప్పుడు గమనిస్తే కత్తితో దాడి చేసినట్లు తెలిసిందే. అది చూసి కరీనా ఎంతోకంగారు పడింది. అందరికీ ఫోన్లు చేసింది.ఎవరూ  ఫోన్‌ తీయలేదు. ఒకరినొకరం చూసుకున్నాం.నేను బాగానే ఉన్నాను. నాకేం కాదని ఆమెకు ధైర్యం చెప్పాను. 

Also Read: Donkey Route: డాంకీ రూట్‌ లో అమెరికా వెళ్తూ..పంజాబ్‌ యువకుడి మృతి!

ఆ సమయంలో తైమూరు నా దగ్గరకు వచ్చి నాన్నా..నువ్వు చచ్చిపోతావా?అని అడిగాడు. అలా ఏం జరగదన్నాను అని చెప్పాను. సైఫ్‌ ను ఇబ్రహీం ఆసుపత్రిలో చేర్చినప్పుడు అతడితో పాటు తైమూర్‌ కూడా ఆసుపత్రికి వచ్చినట్లు లీలావతి వైద్యులు విడుదల చేసిన నివేదికలో ఉంది. దీని గురించి సైఫ్‌ మాట్లాడుతూ దాడి జరిగిన తరువాత కొంతసేపటికీ నా కుమారుడు చాలా కూల్‌ గా ఆలోచించాడు.నేనూ మీతో వస్తాను అని ఆసుపత్రికి వచ్చాడు.

ఒంటరిగా  వెళ్లాలనుకోలే...

నేను కూడా ఒంటరిగా  వెళ్లాలనుకోలేదు. అందుకే నాతో పాటు తైమూర్‌ ను తీసుకెళ్లాను.ఒక వేళ నాకు ఏమైనా జరిగినా ఆ సమయంలో నా కుమారుడు నా పక్కనే ఉండాలని కోరుకున్నాను అని సైఫ్‌ వివరించారు. ముగ్గురూ ఆటోలోనే ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.

మరో వైపు ఈ దాడి కేసులో కీలక పురోగతి కనిపిస్తోంది. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఇటీవల ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మహ్మద్‌ షరీపుల్‌ఇస్లాం షెహజాద్‌ ను ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన సైఫ్‌ ఇంటి సహాయకులకు చూపించారు. ఆర్థర్‌ జైలులో అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ లో నిందితుడ్ని గుర్తించారు. సైఫ్‌ పై దాడి చేసింది అతడేనని తెలిపారు.

Also Read: Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

Also Read: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

Advertisment