/rtv/media/media_files/2025/01/24/QdPuAtqNMq6hhqNvVfwa.jpg)
jammu
Jammu Kashmir: రాజౌరీలోని బధాల్ గ్రామంలో మిస్టరీ మరణాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీని వెనుక కారణం ఏంటో సరైన కారణం తెలియడం లేదు. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని..ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్వారంటైన్ కు తరలించినట్లు వెల్లడించారు.
Also Read: Infosys Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 17 వేల ఉద్యోగాలు..!
కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాలతో వీరిని ఆ కేంద్రాలలో ఉంచారు. కంటైన్‌మెంట్ జోన్ 1..మరణాలు సంభవించిన అన్ని కుటుంబాలను కవర్ చేసత్ఉంది. బాధిత కుటుంబాల నివాసాలు సీల్ చేస్తారు. కంటైన్‌మెంట్ జోన్ 2 లో..బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలు దీని కిందకు వస్తాయి.
వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. కంటైన్‌మెంట్ జోన్ 3.. గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు దీని పరిధిలోకే వస్తాయని అధికారులు వివరించారు. ఇక్కడి ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు. సామూహిక భోజనాలు నిషేధం.లాగ్ బుక్ ల నిర్వహణ వంటి అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
చనిపోయిన వారిలో ఒకే లక్షణాలు...
అయితే చనిపోయిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలను గుర్తించారు. మెదడు ,నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించాయని వైద్య ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మిస్టరీ వెనక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా..బధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 17 మంది అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ అంతుచిక్కని మరణాలతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఈ గ్రామానికే చెందిన ఐజాక్ అహ్మద్ అనే 24 ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు.కాగా ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకొనేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Saif Ali Khan: సైఫ్ దాడి సీన్ ను రీక్రియేట్ చేసిన పోలీసులు..ఏసీ కండక్టర్ నుంచి..
Also Read: Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు