Mumbai Cricket Association: ముంబయి క్రికెట్ అసోసియేషన్ గిన్నిస్ రికార్డు!

వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంది. ఈ సందర్భంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ 14,505 ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించి ‘ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ వాంఖడే స్టేడియం’ అనే వాక్యాన్ని రాసింది. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కైవసం చేసుకుంది.

New Update
Mumbai Cricket Association creates Guinness World Record

Mumbai Cricket Association creates Guinness World Record

ముంబై క్రికెట్ అసోసియేషన్ తన చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయాన్ని అందుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘అతిపెద్ద క్రికెట్ బాల్ సెంటెన్స్’ ఏర్పాటు చేసింది. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కైవసం చేసుకుంది. వాంఖడే క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరిగి నేటికి సరిగ్గా 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ (MCA) సంబరాలు నిర్వహించింది. 

Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా  థాయిలాండ్‌!

1975లో జనవరి 23-29 మధ్య వెస్టిండీస్‌తో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో దివంగత ఏక్‌నాథ్ సోల్కర్ సెంచరీతో చెలరేగాడు. దాన్ని పురస్కరించుకుని బుధవారం వాంఖడే స్టేడియంలో MCA క్రికెట్ బాల్స్‌తో అతి పెద్ద సెంటెన్స్‌ను రూపొందించింది. 

Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

14,505 లెదర్ క్రికెట్ బాల్స్

మొత్తం 14,505 ఎరుపు, తెలుపు లెదర్ క్రికెట్ బంతులను వాంఖడే స్టేడియం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసి, ‘ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ వాంఖడే స్టేడియం’ అనే వాక్యాన్ని రూపొందించారు. ఈ రికార్డును MCA అధ్యక్షుడు అజింక్య నాయక్, ఆఫీస్ బేరర్లు, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సాధించారు.

ఈ రికార్డును సాధించడానికి ఉపయోగించిన బంతులను MCA నగరంలోని పాఠశాలలు, క్లబ్‌లు, NGOల ఆశావహ క్రికెటర్లకు అందజేస్తుంది. ఈ రికార్డు నుండి ప్రేరణ పొంది వారి కెరీర్‌లో గొప్ప మైలురాళ్లను సాధించడానికి వారిని ప్రోత్సహిస్తుంది.

క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం

దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడారు. ముంబై క్రికెట్ క్రీడకు గణనీయమైన కృషి చేసింది అని అన్నారు. క్రికెట్ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని.. ఈ నగరం ప్రపంచం చూసిన గొప్ప క్రికెటర్లలో కొంతమందిని పరిచయం చేసిందని అన్నారు. వాంఖడే స్టేడియం ముంబైకి గర్వకారణం అన్నారు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ ముంబై క్రికెట్ సాధనకు ప్రతిబింబం అన్నారు. 

పలువురికి సత్కరాలు

దీనికంటే ముందు స్టేడియం స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని MCA అనేక అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించింది. వీటిలో ముంబై పురుషుల, మహిళల జట్ల కెప్టెన్లు, 1974లో వాంఖడే స్టేడియంలో తొలిసారిగా ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడిన ముంబై జట్టు సభ్యులు, మాజీ ఎన్నికైన మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబైలను సత్కరించారు. జనవరి 19న జరిగిన ఈ గొప్ప కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, డయానా ఎడుల్జీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే వంటి క్రికెట్ దిగ్గజాలు కిక్కిరిసిన స్టేడియంలో పాల్గొన్న విషయం తెలిసిందే. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు