Sai Durga Tej : నేను ఈ స్టేజీ మీద ఉండటానికి ఆ ముగ్గురే కారణం.. స్టేజ్ పై సాయితేజ్ ఎమోషనల్

తాను ఈ రోజు ఈ స్థాయిలో, ఈ స్టేజ్‌పై నిలబడటానికి తన మామయ్యలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఇచ్చిన ప్రేరణ, మద్దతే కారణమని హీరో సాయి దుర్గా తేజ్ అన్నారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ లో అన్నాడు

New Update
Sai Durga Tej on sambarala yeti gattu movie

Sai Durga Tej on sambarala yeti gattu movie

మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (Sambarala Yeti Gattu). పీరియాడికల్, మైథలాజికల్ కథాంశంతో దర్శకుడు రోహిత్ కె.పి. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను బుధవారం (అక్టోబర్ 15) హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు దర్శకులు దేవ కట్టా, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

Also Read :  డోస్ పెంచేసిన హాట్ బ్యూటీ సాక్షి మాలిక్.. నెట్టింట ఫొటోలు వైరల్

Sai Durga Tej On Sambarala Yeti Gattu Movie 

'సంబరాల ఏటిగట్టు' సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందుతోందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సాయి దుర్గా తేజ్.. ''నేను ఈ స్టేజీ మీద ఉండటానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలకు నేనెప్పటికీ ఋణపడే ఉంటా. ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం తన కెరీర్‌లో అత్యంత కీలకమైందని భావోద్వేగానికి లోనయ్యారు. “యాక్సిడెంట్‌ తర్వాత ‘బ్రో’ సినిమాకు ముందే రెండు ప్రాజెక్టులు ఓకే అయినా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. ఆ తర్వాత నాకు ‘సంబరాల ఏటిగట్టు’లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా కోసం నేను నా శాయశక్తులా కృషి చేశా. మీ అందరి అంచనాలు అందుకునేలా కష్టపడుతున్నాం. ఈ చిత్రం అవుట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. మీరంతా చూసి తప్పక ఎంజాయ్ చేస్తారు. అది నా ప్రామిస్” అని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక ఈ సినిమాలో ఒక పాట కోసం మేకర్స్ అత్యధికంగా ఖర్చు చేశారని వెల్లడించారు. "సినిమాలో ఉన్న అన్ని పాటల్లోకి 'సంబరాల ఏటిగట్టు' అనే పాటకే అత్యధిక బడ్జెట్‌ను కేటాయించాం" అని సాయి దుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ పాటలో వెయ్యి మంది డ్యాన్సర్‌లు పాల్గొన్నట్లు చిత్ర నిర్మాణ బృందం గతంలోనే ప్రకటించింది. దినేష్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. దీంతో ఆ సాంగ్ ఎలా ఉండబోతుందోనని మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Also Read :  అబ్బా.. ఏం అందం రా బాబూ.. బ్లాక్ శారీలో పిచ్చెక్కిస్తున్న నేషనల్ క్రష్! పిక్స్ చూస్తే ఫిదా

ఇదిలా ఉంటే 'హనుమాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇది సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా కావడం విశేషం. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'అసుర ఆగమన' గ్లింప్స్‌లో సాయి తేజ్ శక్తివంతమైన యోధుడి పాత్రలో మాస్ లుక్‌లో కనిపించారు.

"అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం" అంటూ తేజ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అణచివేతకు గురవుతోన్న ప్రజల కోసం హీరో చేసే పోరాటమే ఈ కథాంశంగా తెలుస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొత్తానికి, 'సంబరాల ఏటిగట్టు' చిత్రం ఓ భారీ విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందని చెప్పవచ్చు.

Advertisment
తాజా కథనాలు