టాలీవుడ్ కు రేవంత్ సర్కార్ గట్టి షాకే ఇచ్చింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్, అల్లు అర్జున్ కేస్ అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఇలాంటి ఘటనలు జరక్కుండా ఇకనుంచి సినిమాకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. Also Read : 2024లో బరాక్ ఒబామా ఫస్ట్ ఫేవరేట్ గా ఇండియన్ సినిమా! ఏంటో తెలుసా? బిగ్ బ్రేకింగ్ న్యూస్ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వము - సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి https://t.co/ElUq0gtkc6 pic.twitter.com/z7x3yvnzQE — Telugu Scribe (@TeluguScribe) December 21, 2024 Also Read : నేను చూసేది అదే.. అలా అయితేనే ఒకే చేస్తా! 'గేమ్ ఛేంజర్' కు షాక్ తప్పదా? బెని ఫిట్ షోలు, టికెట్ రేట్లకు పర్మిషన్ లేదంటే ఇది ఒక విధంగా స్టార్ హీరోలకు ఊహించని ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. రేవంత్ ప్రకటనతో టాలీవుడ్ లో మొదటి వేటు పడేది మెగా హీరో రామ్ చరణ్ కు.. ఆయన నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. Also Read : 'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే సుమారు రూ.500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంత కలెక్ట్ చేయాలంటే కచ్చితంగా టికెట్ రేట్లు పెంచడంతో పాటూ ఎక్స్ట్రా షోలు కూడా కావాలి. ఇప్పుడు తెలంగాణాలో అవేం ఉండవని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడంతో.. మూవీ టీమ్ సాధారణ టికెట్ రేట్లతోనే సినిమా రిలీజ్ చేయాలి. అలా చేస్తే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. అన్నట్టు 'గేమ్ ఛేంజర్' సినిమాకే కాదు.. సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలన్నింటికీ ఇదే పెద్ద సమస్యగా మారనుంది. Also Read : లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు