/rtv/media/media_files/2024/12/21/bkNHiZ6dEQ4I57NysPth.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
నార్త్ లో అయితే ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇక ఓటీటీలో సందడి చేసే టైం కూడా వచ్చేసిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు వినిపించాయి. 'పుష్ప 2' జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుందని రూమర్స్ వచ్చాయి.
There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule
— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024
Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️
It won't be on any OTT before 56 days!
It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
అప్పటిదాకా థియేటర్స్ లోనే..
దీనిపై మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. 'పుష్ప2' ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. ఈ సెలవుల్లో సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్ చేసింది. అంతేకాకుండా రిలీజైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో 'పుష్ప2' ఓటీటీకి వస్తోందన్న రూమర్స్‌కు చెక్ పడింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు